కేంద్రమంత్రి అనుప్రియలో ఈ సినిమా కూడానా?

Update: 2016-09-11 09:22 GMT
ఈ మధ్యన కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధాని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన అప్నాదల్ పార్టీకి చెందిన అనుప్రియకు మంత్రి పదవిని ఇచ్చిన వైనం పలువురి దృష్టిని ఆకర్షించింది. సొంతపార్టీతో పంచాయితీ పెట్టుకున్న అనుప్రియకు పిలిచి మరీ మోడీ పెద్ద పీట వేయటంతో ఆమెకు సంబంధించిన వార్తలు చాలానే మీడియాలో కవర్ అయ్యాయి. దీంతో.. దేశ ప్రజలకు ఆమె సుపరిచితురాలయ్యారు.

అలాంటి ఆమె తాజాగా ఒక వివాదంలోఇరుక్కున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. కేంద్రమంత్రి అనుప్రియ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారటమే కాదు.. షాకింగ్ గా మారింది. అదెలా అంటే.. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం ఇంజనీర్లు.. కాంట్రాక్టర్ ఇద్దరూ చెప్పిన పని చెప్పిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహించిన మంత్రిగారు.. వారిద్దరిని గదిలో పెట్టి బంధించటం సంచలనంగా మారింది.

తాజాగా అనుప్రియ ఇంట్లో కొన్నిరిపేర్లు చేయిస్తున్నారు. అయితే.. చెప్పిన పని సమయానికి చేయలేదని వర్కర్లను ఇంట్లోనే బంధించటం.. ఆ విషయం బయటకు రావటంతో మీడియాలో ఫోకస్ అయ్యారు. అయితే.. తాము బంధించటం లాంటివి చేయలేదని మంత్రిఅనుప్రియ.. ఆమె భర్త ఇద్దరూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే యూపీలో ఎన్నికలు వస్తున్న వేళ.. ఇలాంటి వివాదాలు మంత్రిగారికి కొత్త కష్టాలు తెచ్చి పెడతాయని చెబుతున్నారు. అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బెదిరింపులేంది? ఎంత కేంద్రమంత్రి అయినా.. ఆ హవా పదవి ఉన్నంత వరకే. ఇలాంటి సినిమాలు చూపిస్తే.. పదవి కాకి ఎత్తుకెళ్లటం ఖాయమన్న విషయం  అర్థం చేసుకుంటే మంచిది.
Tags:    

Similar News