ప్రధానిపై కశ్యప్ సంచలన వ్యాఖ్యలు!

Update: 2016-10-17 07:29 GMT
భారత్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సంగతెలా ఉన్నా బాలీవుడ్ వేదికగా మాత్రం ఉరీ ఉగ్రదాడి అనంతరం రచ్చ రచ్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ కళాకారులపై నిషేధం, ఇదే క్రమంలో తాజాగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాను నిషేదించడం - థియేటర్లు ఇవ్వకపోవడం వంటి సంఘటనలతో ఈ టాపిక్ మరింత వేడెక్కింది. తాజాగా ఈ విషయాలపై నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్... ఈ మేరకు ప్రధానిని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే హక్కు తనకుందంటున్న ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్...  గతేడాది డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ లాహోర్ వెళ్లినందుకు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానిని ప్రశ్నించే హక్కు తనకుందన్న కశ్యప్ - తమల్ని రక్షించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తోన్నాయి. అయితే ఈ విమర్శలపై కూడా స్పందించిన కశ్యప్ వాటిని ఖండిస్తూ... సోషల్ మీడియాలో తన ప్రతాపం చుపాలనుకోవడం లేదని, ఎవరైతే తన దేశభక్తిని ప్రశ్నించాలనుకుంటారో, వారు ముందుగా తమ దేశభక్తిని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు.

థియేటర్ యజమానులు - ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇండియా లు పాకిస్తానీ నటీనటులు నటించిన సినిమాల విడుదలను నిషేధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కశ్యప్... కరణ్ జోహార్ కు మద్దతుగా నిలిచారు. "ఏ దిల్ హై ముస్కిల్" లో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ఆ సినిమాను నాలుగురాష్ట్రాల్లో విడుదల చేయరాదని థియేటర్ యజమానులు - ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై డైరెక్టుగా ప్రధానితోనే చర్చిస్తానని, ప్రధానిని మెప్పించడానికి నిషేధాల పేరుతో తప్పుడు జాతీయవాది కార్యకలాపాలకు పాల్పడుతూ తాను వార్తలోకి ఎక్కనని ప్రకటించిన కశ్యప్... కరణ్ జోహార్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ప్రదర్శించనీయకుండా అడ్డుకోవడం తగదంటూ మోడీని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News