కరోనా వేరియంట్ ఏదైనా.. దాని అంతు చూసే మహా టీకా ప్రయోగం

Update: 2021-06-24 14:30 GMT
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి దూకుడుకు కళ్లాలు వేసే ప్రయత్నాలు జోరున సాగుతున్న విషయం తెలిసిందే. కరోనా తీవ్రతను తగ్గించటమే తప్పించి.. దాన్ని పూర్తిస్తాయిలో అడ్డుకునే టీకాలు ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవటం తెలిసిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు.. కొత్త వేరియంట్లపై పెద్ద ప్రభావం చూపించలేకపోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు కొన్ని టీకాలు మినహాయింపుగా చెప్పాలి.

కరోనా వేరియంట్ ఏదైనా సరే.. దాని అంతు చూసేందుకు వీలుగా ‘బాహుబలి’ టీకా పరిశోధన ఒకటి అమెరికాలో సాగుతోంది.  కొవిడ్ సార్స్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి వైరస్ అయినా.. అదెన్ని రూపాల్లోకి మారినా దాని అంతు చూసేందుకు ఈ బాహుబలి టీకా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. యూనివర్సల్ వ్యాక్సిన్ ప్రయోగాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైనట్లుగా సైన్స్ జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. కరోనా కుటుంబం నుంచి ఏ రకం వైరస్ వచ్చినా అడ్డుకోవటమే ఈ బాహుబలి టీకా లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఎంఆర్ఎన్ఏ కోడ్ పై ఇప్పుడు ఫోకస్ చేశారు. ఫైజర్.. మోడెర్నాలు ఒక వైరస్ ఎంఆర్ఎన్ఏ కోడ్ ఆధారిత టీకాల్ని డెవలప్ చేశాయి. ఈ నమూనాను అనుసరించి పలు రకాల కరోనా వైరస్ ల ఎంఆర్ఎన్ఏ కోడ్ లను జత చేసి హైబ్రిడ్ టీకాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

ఈ బాహుబలి టీకాను ఎలుకలకు ఇస్తే.. విభిన్న రకాల స్పైక్ ప్రోటీన్లను నిర్వీర్యపరిచే యాంటీబాడీస్ వాటి శరీరాల్లో ఉత్పత్తి అయ్యాయని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది? మరి.. ఈ బాహుబలి టీకా ఎప్పుడు వచ్చే వీలుంది? అన్న ప్రశ్నకు వచ్చే ఏడాది అని సమాధానం వస్తోంది. ఒకవేళ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచం మొత్తానికి చేరుకోవటానికిక మరో ఏడాది పట్టొచ్చేమో?
Tags:    

Similar News