ఫారిన్ నుంచి వచ్చినోళ్లు ఎవరైనా ఆ మాజీ కేంద్రమంత్రిని ఫాలో కావాలి

Update: 2020-03-18 07:00 GMT
కరోనా వైరస్ వణికిస్తోంది. మరి.. దీనికి చెక్ పెట్టటం ఎలా? మార్కెట్లో దీన్ని నిర్మూలించే వ్యాక్సిన్ లేని నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండటమే ఈ వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశాన్ని ఇస్తుందని చెప్పాలి. ఎవరికి వారు.. తమ బాగుతో పాటు.. ఎదుటోడి బాగు గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిందే. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. సదరు వ్యక్తికే కాదు.. వారి కుటుంబానికి.. చుట్టుపక్కల ఉన్న వారందరికి కొత్త ముప్పు తప్పదు.

విదేశాల నుంచి వచ్చిన వారు..ఇటీవల భారత్ లోకి వచ్చిన విదేశీయుల్ని కలిసిన వారు.. వారితో కలిసి పని చేసినోళ్లు ఎవరైనా సరే.. తమను తాము స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవటానికి మించిన మంచి పని ఉండదు. ఈ విషయంలో పలువురు సెలబ్రిటీలు.. రాజకీయ ప్రముఖులు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత కమ్ మాజీ కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇటీవల ఆయన భారత్ తరఫున జీ20 సదస్సు ప్రతినిధిగా వెళ్లారు. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ లో నిర్వహించిన మీటింగ్ కు ఆయన వెళ్లారు. ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కరోనా టెస్టు చేయించుకున్నారు. నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. తాను పద్నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు రానని.. ఇంట్లోనే ఐసోలేషన్ ఏర్పాట్లు చేసుకొని ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇదే రీతిలో మిగిలిన వారంతా ఫాలో అయితే.. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉందని చెప్పక తప్పదు. సో.. విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరు.. కరోనా తమకు సోకే అవకాశం ఉందని అనుమానించే వారంతా.. ఎవరికి వారుగా కేంద్రమంత్రి సురేశ్ ప్రభును ఫాలో అయితే బెటర్.
Tags:    

Similar News