AP: 15 రోజుల పవర్ హాలిడే పొడిగింపు

Update: 2022-05-02 04:29 GMT
ఏపీ రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్ హాలిడే మరో 15 రోజులు తప్పదు. అందుబాటులోకి వస్తుందని అనుకున్న విద్యుత్ ఉత్పత్తి రాకపోగా గృహావసరాలకు వాడుతున్న విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోవటంతో వేరే దారి లేక ప్రభుత్వం పవర్ హాలిడేని పొడిగించింది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. దాంతో జనాలు 24 గంటలూ ఫ్యాన్లు, రాత్రిళ్ళు ఏసీలు లేదా ఎయిర్ కూలర్లు వాడకుండా నిద్రకూడా పోలేనిస్ధితి.

అందుకనే ప్రభుత్వం ఏసీల వాడకాన్ని తగ్గించమని విజ్ఞప్తి చేస్తున్నా జనాలు పట్టించుకోవటం లేదని ప్రభుత్వం అంటోంది. విద్యుత్ ఉత్పత్తి పెరగని కారణంగా అందుబాటులో ఉన్న విద్యుత్ ను ఎలా సర్దుబాటు చేయాలో అర్ధం కావటం లేదు.

అందుకనే టాప్ ప్రయారిటి గృహావసరాలకు ఇచ్చింది. 24 గంటలూ విద్యుత్ అవసరమైన పరిశ్రమలు తక్కువగానే ఉండటం, వాటిపైన ఆధారపడే కార్మికులు, ఉద్యోగులతో పోల్చినపుడు ఇతర జనాల సంఖ్యే ఎక్కువగా ఉంటంది.

అందుకనే పరిశ్రమలను ఒక ఫిష్ట్ లోనే నడిపించమని చెప్పి అలా ఆదాయ్యే విద్యుత్ ను గృహావసరాలకు ప్రభుత్వం మళ్ళిస్తోంది. ఫెర్రో అల్లాయీస్, సిమెంట్, ఉక్కు, టెక్స్ టైల్స్ పరిశ్రమల ఉత్సత్తిపై పవర్ హాలిడే ప్రభావం తప్పదు. పవర్ హాలిడే ఏప్రిల్ 8వ తేదీనుండి అమలవుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణంగా బొగ్గు దిగుమతిపై బాగా ప్రభావం చూపుతోంది. మనకు ఉక్రెయిన్ నుండి బొగ్గు దిగుమతవుతోంది. అలాగే ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుండి కూడా వస్తోంది.

ఏపీలో ముఖ్యంగా పీపీఏల విషయంలో జగన్ విద్యుత్ కంపెనీలతో వ్యవహరించిన తీరుతో వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. జగన్ దెబ్బ వల్ వారు తొలుత ఉత్పత్తి తగ్గించారు. ఇది ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపింది. గతంలో ఎండాకాలంలో కూడా ఏపీలో పవర్ సర్ ప్లస్ ఉండేది. కానీ నేడుపరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మరోవైపు ఆస్ట్రేలియా, ఇండోనేషియాలు వ్యూహాత్మకంగా బొగ్గు సరఫరాను  తగ్గించేశాయి. ఇదే సమయంలో మనదేశంలోనే ఉన్న బొగ్గు నిల్వలను వెలికితీయటంలో కేంద్రం ఎందుకనో సరిగా వ్యవహరించటంలేదు. ఇలాంటి అనేక కారణాల వల్ల దేశంలోని 18 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా పవర్ హాలిడే ప్రకటించేశారు. ఎంతో గొప్పగా కేటీయార్ కోతలుకోస్తున్న తెలంగాణాలో కూడా విద్యుత్ కోతలు ఎక్కువగానే ఉన్నాయి. అందుబాటులో ఉన్న పరిస్ధితులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం మరో 15 రోజులు పవర్ హాలిడే ప్రకటించక తప్పలేదు.
Tags:    

Similar News