బ్రేకింగ్ : ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ హైలైట్స్‌ ..!

Update: 2020-06-16 14:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్లను ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి 13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

వ్యవసాయ బడ్జెట్‌ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి ...

3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి
రైతు భరోసా కేంద్రాల కు 100 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 500 కోట్లు
వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను 1100 కోట్లు
రైతులకు ఎక్స్ గ్రేషియో కు 20 కోట్లు
రాయితీ విత్తనాల కోసం 200 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ కు 207.83 కోట్లు
ప్రకృతి వ్యవసాయానికి 225.51 కోట్లు
ప్రకృతి విపత్తు నిధి 2000 కోట్లు
ఎన్జీ రంగా యూనివర్సిటీ కి 402 కోట్లు
ఉద్యాన వన అభివృద్ధి కి 653.02 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కి 88.60 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధి కి 92.18 కోట్లు
పశు సంవర్థక శాఖ కు854.77 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్య శాల కు 122.73 కోట్లు
మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు
సహకార శాఖ కు 248.38 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 4450 కోట్లు
వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్యశాలకు 122.73 కోట్లు
మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు
సహకార శాఖ కు 248.38 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కి 4450 కోట్లు
వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు
Tags:    

Similar News