అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు రాహుల్‌.. క‌లిసి న‌డ‌వ‌నున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌

Update: 2022-10-18 13:33 GMT
ఏపీ రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ అగ్ర నేత ఎంపీ, రాహుల్గాంధీ అన్నారు. ఆయ‌న‌ను మంగ‌ళ‌వారం రాజధాని రైతులు కలిశారు. అమరావతి రైతుల పోరాటానికి న్యాయసహాయం అందిస్తామన్న రాహుల్.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు.

త్వ‌ర‌లోనే తాను పాద‌యాత్ర చేస్తున్న వారితో క‌లిసి మాట్లాడ‌తాన‌ని చెప్పిన‌ట్టు రైతులు తెలిపారు. తాను అధికారంంలోకి వ‌స్తే.. తొలి సంత‌కం.. హోదాపైనే ఉంటుంద‌ని.. మ‌రో సారి రాహుల్ చెప్పిన‌ట్టు రైతులు పేర్కొన్నారు.

రాహుల్ చేస్తున్న భార‌త్ జోడో పాద‌యాత్ర క‌ర్ణాట‌క నుంచి క‌ర్నూలు జిల్లాలో ప్రవేశించింది. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చిన అభిమానులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని ప్రాంత రైతులు కూడా.. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్యేకంగా ఆయ‌న‌తో మాట్లాడారు.  అమరావతినే రాజధానిగా ఉంచాలని రాహుల్ను కోరారు. అమరావతే ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా ఉంటుందని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు.

ఇదే విష‌యాన్ని రైతులు మీడియాకు తెలిపారు. తమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారని.. న్యాయ సహాయం చేస్తామని చెప్పారని.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్ చెప్పినట్లు రైతులు తెలిపారు. అంతకుముందు రాహుల్గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. త‌మ పార్టీని ఆద‌రించాల‌ని.. రాహుల్ ఈ సంద‌ర్భంగా వారిని కోరిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా రాజ‌ధాని అమ‌రావ‌తికి రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. రైతుల పాద‌యాత్ర‌కు సంఘీభావం తెలిపి.. తాను కూడా పాదం క‌దుపుతాన‌ని హామీ ఇవ్వ‌డం.. వారిలో సంతో షాన్ని నింపుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News