రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ మహానగరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండే పరిస్థితి. అయితే.. వీలైనంత త్వరగా హైదరాబాద్ ను వదిలేయాలన్న ఆలోచనను కాస్త ఆల్యసంగా తీసుకున్నప్పటికీ అమలు చేసే విషయంలో వేగంగా చేసుకెళుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కారణాలు ఏమైనా.. హైదరాబాద్ ను వదిలేయాలన్న చంద్రబాబు నిర్ణయం ఏపీ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ఒక చోట.. ప్రజలు మరోచోట అన్న భావనపై సీమాంద్ర ప్రజలు గుర్రుగా ఉన్నప్పటికీ బాబు పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.
దీన్ని గుర్తించిన చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి.. ఏపీ మీద ఫోకస్ చేయటం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తన నివాసాన్ని ఏపీకి మార్చేసిన ఆయన.. ఈ జూన్ పూర్తయ్యే నాటికి హైదరాబాద్ లోని సచివాలయ ఉద్యోగుల్ని ఏపీ తాత్కలిక రాజధానికి తరలించాలన్న నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. జూన్ లో ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని తరలిస్తున్న నేపథ్యంలో.. ఏపీ వర్షాకాల సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న వ్యక్తమైంది. దీనిపై తాజాగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు క్లారిటీ ఇచ్చేశారు.
బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన ఏపీ మంత్రి యనమల.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్ని ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికి పలుమార్లు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నా.. ఏదో ఒక కారణంతో హైదరాబాద్ లో నిర్వహించాలన్న నిర్ణయం తీసుకునేవారు. దీనికి భిన్నంగా.. అసెంబ్లీలోనే వచ్చే సమావేశాల గురించి అధికార ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. ఏపీ వర్షాకాల సమావేశాలు అమరాతిలో నిర్వహించటం ఖాయమని తేలిపోయింది. సో.. తాజా అసెంబ్లీ సమావేశాలతో ఏపీ సర్కారు హైదరాబాద్ కు గుడ్ బై చెబుతున్నట్లే.