ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకంటే?

Update: 2020-11-30 11:30 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే అధికార , ప్రతిపక్షాల మధ్య సెగలు పుట్టే వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు రైతుల సమస్యలపై రైతుల వేషంలో అసెంబ్లీకి వచ్చారు. ఈసారి అసెంబ్లీకి టీడీపీ ప్రజాప్రతినిధులు వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ధర్నా చేపట్టింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. తడిచిన వరి కంకులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. 20 అంశాలపై వెరైటీ ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. సమావేశాలు ప్రారంభమైన తరువాత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.

అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా సమావేశాలను 5 రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డిసెంబర్ 5వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. 21 అజెండా అంశాలను వైసీపీ ప్రతిపాదించింది.

కాగా తొలిరోజు వ్యవసాయ రంగంపై తొలి రోజు చర్చ జరుగబోతోంది. ఇక నివర్ తుఫాన్ ప్రభావం, పంటనష్టంపై కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చించబోతున్నారు.
Tags:    

Similar News