సైకిల్‌ తో నాగ‌బాబు చెడుగుడు

Update: 2019-02-11 12:58 GMT
న‌టుడు, జ‌నసేనాధిప‌తి ప‌వ‌న్ అన్న‌య్య అయిన నాగ‌బాబు తాప‌త్ర‌యం చూస్తుంటే ఎలాగైనా తమ్ముడిని అధికారంలోకి తేవాల‌ని తెగ ట్రై చేస్తున్నారు. జ‌న‌సేన పార్టీకి అప్ర‌క‌టిత అధికార ప్ర‌తినిధిగా ఆయ‌న సేవ‌లు అందిస్తున్నారు. మీరు  యూట్యూబ్ వాడేవారే అయితే మీకు విష‌యం అర్థ‌మ‌య్యే ఉంటుంది. ఇటీవ‌ల నాగ‌బాబు ఒక యుట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి రాజ‌కీయ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌తిరోజు స్పందిస్తున్నారు.

ఇక ఆయ‌న కాన్స‌ట్రేట్ చేస్తున్న కంటెంట్ చూస్తుంటే ఏపీలో జ‌న‌సేన కాకుండా అన్ని పార్టీల‌పై ఆయ‌న వ్యాఖ్యానాలు చేస్తున్నా... లోకేష్‌ ని, తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకుంటున్నారు. వారికి నిద్ర‌ప‌ట్ట‌కుండా చేయ‌డంలో నాగ‌బాబు కొన్ని సార్లు బాగా స‌క్సెస్ అవుతున్నారు. మొన్నామ‌ధ్య ఏబీఎన్ లోకేష్ భ‌జ‌న అంటూ చేసిన వీడియో బాగా వైర‌ల్ అయ్యింది. అంత‌కుమునుపు కూడా లోకేష్‌ పై వీడియోలు చేశారు.

తాజాగా... తెలుగుదేశం పార్టీ సింబ‌ల్‌ ను వాడి ఆ పార్టీ పేరు వాడ‌కుండా తెలుగుదేశం పార్టీని ఏపీ నుంచి త‌రిమేయండి అన్న‌ట్లు త‌న‌దైన చ‌మ‌త్కారంతో అంద‌రికీ పిలుపునిచ్చారు నాగ‌బాబు. స‌రిగ్గా ఒక‌టిన్న‌ర నిమిషం కూడా లేని ఆ వీడియో కంటెంట్ లో ఏముందంటే... ఇద్ద‌రు పిల్ల‌లు సైకిల్ తో ఆడుకుంటూ ఉంటారు. ఒక‌రేమో సైకిల్ తొక్కుతూ రౌండ్లు కొడుతుంటే ఇంకో పిల్లాడేమో సైకిల్‌ ని కాలుతూ ఆగ్రహంతో తొక్కుతూ ఉంటారు. నాగ‌బాబు వాయిస్ ఓవ‌ర్‌ లో సైకిల్‌ పై రౌండ్లు వేస్తున్న అబ్బాయిని బాబూ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఆరోగ్యం బాగుండాల‌ని, సైకిల్ తొక్కుతున్నా అంకుల్ అంటాడు. ఇంకో అబ్బాయిని అడిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాగుండాల‌ని సైకిల్‌ని తొక్కుతున్నాను అంకుల్ అంటాడు... చూశారా అంటూ నాగ‌బాబు తెర‌మీద‌కు వ‌చ్చి మీ ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్‌ తొక్కండి. ఆంధ్ర ప్ర‌దేశ్ బాగుండాలంటే సైకిల్‌ నే తొక్కండి అంటూ వ్యాఖ్యానించి ఇది ఎవ‌రి గురించో కాదు... మేము సైకిల్ కంపెనీకి చేసిన ఒక ప్ర‌క‌ట‌న అంటూ వ్యంగాస్త్రం వేశారు నాగ‌బాబు.

మొత్తానికి చంద్ర‌బాబు, లోకేష్‌... స్వ‌యంకృతాప‌రాధాలే ఇపుడు వారికి శాపాలై అష్ట‌దిక్కులా చుట్టుముడుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టించినా ఇంత‌కాలం చేసిన‌వి ఊరికే పోతాయా? అందుకే జ‌నానికి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మోసాలు అర్థ‌మ‌య్యాయి కాబ‌ట్టే వారిని ఎవ‌రు విమ‌ర్శించినా దానికి మ‌ద్ద‌తు లభిస్తోంది.
   

Full View

Tags:    

Similar News