ఏపీ బడ్జెట్ హైలైట్స్

Update: 2022-03-11 07:30 GMT
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు."గొప్ప పాలకులు అనబడే వారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు." అని తిరువళ్లువార్ సూక్తులను గుర్తు చేశారు.

రూ.2,56,256 కోట్లతో వార్షిక బడ్జెట్ ను రూపొందించామని బుగ్గన వెల్లడించారు. విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, 'నాడు-నేడు'తో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో సారి బుగ్గన బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.

ఏపీ బడ్జెట్ 2022-23 హైలైట్స్:

    మొత్తం బడ్జెట్ - రూ. 2,56,256 కోట్లు
    రెవెన్యూ వ్యయం - రూ. 2,08,261 కోట్లు
    మూలధన వ్యయం - రూ. 47,996 కోట్లు
    రెవెన్యూ లోటు - రూ. 17,036 కోట్లు
    ద్రవ్యలోటు - రూ. 48,724 కోట్లు

* వైఎస్ఆర్ రైతు భరోసా - రూ.3,900 కోట్లు
* పెన్షన్ కానుక - రూ.18 వేల కోట్లు
* మైనారిటీ సంక్షేమం - రూ.2,063 కోట్లు
* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - 15,846 కోట్లు
* రెవెన్యూశాఖ - రూ.5,306 కోట్లు
* వృత్తి నైపుణ్యం - రూ.969 కోట్లు
* సాంఘిక సంక్షేమం - రూ.12,728 కోట్లు
* రోడ్లు, భవనాలు - 8,581 కోట్లు
* మహిళా శిషు సంక్షేమం - రూ.4,382 కోట్లు
* వైద్య, ఆరోగ్యం - రూ.15,384 కోట్లు
* గృహ నిర్మాణం - 4,791 కోట్లు
* అటవీ శాఖ - రూ.685 కోట్లు
* ఉన్నత విద్య - రూ.2,014 కోట్లు
* సెకండరీ ఎడ్యుకేషన్ - రూ.22,706 కోట్లు
* ఈడబ్ల్యూఎస్ - రూ.10,201 కోట్లు
* పౌర సరఫరాల శాఖ - రూ.3,710 కోట్లు
* వార్డు వాలంటీర్లకు - రూ.3,396 కోట్లు
* నీటి పారుదల, వరదల నివారణ - రూ.11,482.37 కోట్లు
* సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ.11.78 కోట్లు
* రవాణా రంగం - రూ.9,617.15 కోట్లు
Tags:    

Similar News