లైవ్: మండలి రద్దు పై శాసనసభ ఒక్కరోజే

Update: 2020-01-27 06:33 GMT
ఏపీ శాసన మండలి రద్దు బిల్లు బీఏసీ సమావేశం ముందుకు వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు స్పీకర్ కోరిక మేరకు దీనిపై అధికార ప్రతి పక్షాలతో స్పీకర్ తమ్మినేని సోమవారం మధ్యాహ్నం బీఏసీ సమావేశం నిర్వహించారు.

ఈ శాసనమండలి రద్దు బిల్లు సభలో ప్రవేశ పెట్టాలన్న బిల్లుకు బీఏసీ సమావేశం లో ఏకాభిప్రాయం వచ్చింది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడం, చర్చించడం.. పూర్తి చేయడం అంతా ఈ ఒక్కరోజులోనే అని తీర్మానించారు.

దీంతో శాసనమండలి బిల్లు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఒక్కరోజులోనే దాని పై సుధీర్ఘం గా చర్చించనున్నారు. ఎంత రాత్రైనా సరే అందరూ చర్చించాక దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని బీఏసీ సమావేశం లో నిర్ణయించారు.

ఈ సోమవారం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశం కానుంది. ఈరోజు మండలి బిల్లు పై చర్చించి ఆమోదించి కేంద్రానికి పంపుతారు. కాగా ఈ మండలి రద్దు బిల్లు లో చర్చలో పాల్గొనకూడదని ప్రతిపక్ష టీడీపీ, చంద్రబాబు నిర్ణయించారు. వారు ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.
Tags:    

Similar News