ప్రవీణ్ ప్రకాష్.. సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి, సాధారణ పారిపాలన ముఖ్య కార్యదర్శి కూడా.. ఢిల్లీలో పనిచేస్తున్న ఈయనను తీసుకొచ్చి మరీ అత్యున్నత పదవి ఇచ్చారు. కానీ ఈయన వ్యవహార శైలి ఇప్పుడు ఏపీ ఐఏఎస్ సీనియర్ అధికారుల్లో కలకలం రేపింది. సీఎం జగన్ తర్వాతే తానే బాస్ అన్నట్టుగా ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న నిర్ణయాలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఏపీలో బిజినెస్ రూల్స్ మార్చే అధికారం కేవలం గవర్నర్, మంత్రి మండలి ఆమోదంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేయాల్సిన సర్వీస్ రూల్స్ మార్పులను ప్రవీణ్ ప్రకాశ్ జారీ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన ఈ జీవో చెల్లదని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో ప్రవీణ్ ప్రకాష్ పై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరుతూ ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతటికి బాస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే.. అర్హత లేకుండానే సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్ ను మార్చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు.
దేశ చరిత్రలోనే ఒక కింది స్థాయి అధికారి తనకు తాను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసి బిజినెస్ రూల్స్ మార్చడం సంచలనంగా మారింది. సీఎస్ అధికారాలనే బుట్టదాఖలు అయ్యేలా అర్హత లేకున్నా సర్వీస్ రూల్స్ మార్చేసిన జగన్ ముఖ్య కార్యదర్శి - సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు. ఏపీలోని ఇద్దరు కీలక ఉన్నతాధికారుల మధ్య ఈ నోటీసుల వ్యవహారం ఏపీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అంతర్గతంగా జరగాల్సిన ఈ ప్రక్రియ బయటపడడం ఏపీ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.