నిన్న 8మంది ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్స్ ఇచ్చిన ఏపీ సీఎం

Update: 2020-06-24 04:15 GMT
జగన్ ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు చేరువ అయ్యారు. దాదాపు హామీనిచ్చిన 90శాతం ఇప్పటికే అమలు చేశారు. అయితే ఇంత చేసిన  తర్వాత కూడా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలు పనులు జరగడం లేదని.. అభివృద్ధిలో జాప్యం జరుగుతుందని నినదించిన సందర్భాలున్నాయి. అందుకే ఇక పార్టీని కూడా పట్టించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తూనే మరోవైపు పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతీ ఎమ్మెల్యేకు అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ వారి సాధకబాధకాలు తెలుసుకొని తీర్చేవారు. అలా అసమ్మతి సెగ లేకుండా పార్టీని 10 ఏళ్లు అధికారంలో నిలబెట్టారు.  ఇప్పుడు తండ్రిబాటలోనే సీఎం జగన్ కూడా వైసీపీ ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు.

  చంద్రబాబులా పాలననే పట్టించుకుంటే దెబ్బకు వస్తుందని గ్రహించిన సీఎం జగన్ తన నాన్న వైఎస్ఆర్ బాటలో నడిచేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ సిస్టం ఫాలో అవ్వాలని నిర్ణయించారు.

తాజాగా సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్ మెంట్లు ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ఎన్నికల హామీలు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి  వారితో జగన్ చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తాజాగా ఒకరిద్దరు నేతలతో సీఎం చర్చించారు.

నిన్న దాదాపు 8మంది వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్ మెంట్లు ఇచ్చారు. వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చడానికి నిధులు కేటాయిస్తానన్నారు.  రానున్న రోజుల్లో మరింతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ భేటి కానున్నారు. 
Tags:    

Similar News