రోటీన్ కు భిన్నమైన పరిణామాలు తాజాగా ముగిసిన ఏపీ కేబినెట్ భేటీలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తన మంత్రులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోయిన వైనంపై.. తన మంత్రులు ఫలువురు స్పందించిన తీరుపై సీఎం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పులిచింతల ఎపిసోడ్ పై విపక్ష నేతలు విరుచుకుపడుతుంటే.. అధికారపక్ష నేతలు మాత్రం పొడి పొడిగా సమాధానాలు ఇచ్చారే కానీ.. ప్రభుత్వ వాదనను బలంగా వినిపించటంలో ఫెయిల్ కావటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టు గేట్లు విరిగిపోయిన వెంటనే.. దానికి కారణం ప్రభుత్వ ఆలసత్వంతో పాటు.. దివంగత మహానేత వైఎస్ హయాంలో జరిగిన తప్పులేనంటూ విపక్షాలు విరుచుకుపడిన వేళలో.. దాన్ని ఖండించేలా పలువురు మంత్రులు వ్యవహరించలేదన్న విషయంపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. విపక్షాలు విరుచుకుపడినప్పుడు.. వారి వాదనల్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యతను మంత్రులు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సీఎం జగన్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
కేబినెట్ బేటీ సందర్భంగా ఇద్దరు బీజేపీ నేతల ప్రస్తావనను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని.. వారికి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేసినట్లుగా చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు విరిగిపోతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే.. మంత్రులు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదన్న విషయాన్ని సూటిగా ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇలాంటి విమర్శలు ప్రజల్లోకి వెళితే.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలిసింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమావేశంలోని ముగ్గురు మంత్రుల్ని జగన్ ప్రత్యేకంగా ప్రశ్నించినట్లుగా సమాచారం. విపక్షాల్ని ప్రశ్నించేలా ఎందుకు మట్లాడలేకపోతున్నట్లుగా అడిగినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మంత్రుల వ్యాఖ్యల్ని తాను ఫోకస్ పెడతానని చెప్పినట్లుగా సమాచారం. ఒక రకంగా.. మంత్రుల్లోని కొందరిపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్న విషయం తాజా కేబినెట్ సమావేశం స్పష్టం చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది.