దక్షిణాఫ్రికా.. అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం రాకముందు నల్ల జాతీయుడు అని మన గాంధీజీని రైల్లోంచి తోసేసిన దేశం అదీ.. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులకు - నల్ల జాతీయులకు వైరం ఇప్పటిది కాదు.. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉంది. ఇప్పటికీ అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో తెల్ల జాతీయులతోపాటు రబాడా - ఫిలోకేవియా - డుమిని లాంటి నల్ల జాతీయులు ఉంటారు. అంతటి జాతి వివక్ష కలిగిన దేశం కాబట్టే ఆ దేశంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి ఆయా జాతులను శాంతపరిచారు. దక్షిణాఫ్రికాలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రిటోరియా - జ్యూడిషియల్ రాజధానిగా బ్లూమ్ ఫాంటేన్ - లెజిస్లేటివ్ రాజధానిగా కేప్ టౌన్ ఉంటుంది.
ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితి.. రాజధానిని అమరావతిలో పెడితే మా గతేంటని రాయలసీమ - ఉత్తరాంధ్ర వాసులు పోరుబాట పట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని 97రోజులుగా కర్నూలులో ఆందోళనలు - దీక్షలు చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని అక్కడి వారు కోరుతున్నారు. అందుకే సీఎం జగన్ ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు సౌతాఫ్రికా మోడల్ ను తెరపైకి తెచ్చారు.
సౌతాఫ్రికా తరహాలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ - చట్టసభల రాజధానిగా అమరావతి - జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని జగన్ ప్రతిపాదించారు.
అయితే ఇలా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ప్రతిపాదన కేవలం ఏపీలోనే ఉందనుకుంటే పొరపాటే.. సౌతాఫ్రికానే కాదు.. మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో అక్కడి వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం చేసేందుకు వికేంద్రీకరణ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజధానులను విభజించారు. పక్కనున్న మహారాష్ట్రలో వేసవి క్యాపిటల్ గా ముంబై - శీతాకాల రాజధానిగా నాగపూర్ ను ఏర్పాటు చేశారు. వెనుకబడిన నాగపూర్ లో అప్పట్లో విదర్భ ఉద్యమం సాగింది. తమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పోరాటం చేశారు. దీంతో శీతాకాల రాజధానిగా నాగపూర్ ను మార్చి వారికి న్యాయం చేశారు. దేశంలో ఇలా వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన రాష్ట్రాలను ఒకసారి చూద్దాం. రాజధానిలో సెక్రెటేరియట్ - అసెంబ్లీలు ఉంటే.. హైకోర్టును వేరే చోట ఏర్పాటు చేశారు.
రాష్ట్రం - రాజధాని- హైకోర్టు
ఒడిషా భువనేశ్వర్ కటక్
పాండిచ్చేరి పాండిచ్చేరి చెన్నై
చత్తీస్ ఘడ్ రాయపూర్ బిలాస్ పూర్
మధ్యప్రదేశ్ భోపాల్ కటక్
ఉత్తరప్రదేశ్ లక్నో అలహాబాద్
గుజరాత్ గాంధీనగర్ అహ్మదాబాద్
కేరళ తిరువనంతపురం కొచ్చి
రాజస్థాన్ జైపూర్ జోధ్ పూర్
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ నైనిటాల్
గోవా పనాజి ముంబై
మిజోరం ఐజ్వాల్ గౌహతి
అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ గౌహతి
నాగాలాండ్ కోహిమా గౌహతి