జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు అని వార్తలు వచ్చాయి. నిజానికి ఇది చాలా ఆసక్తిని లేపింది. వైసీపీలో కూడా క్యాడర్ కి సంతోషకరమైన వార్త అయింది. ఇన్నాళ్ళకు అధినాయకుడు కరుణించారు అనుకున్నారు. దాంతో వారు కూడా మనసు విప్పి తమ గోడుని వెళ్ళబోసుకోవచ్చు అని కూడా తలచారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ కార్యకర్తల మీటింగ్ అని కూడా వార్తలు రావడంతో ఉత్కంఠ బాగా పెరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్ తో కుప్పం మీటింగ్ జరిగింద్.
అయితే చివరికి తేలింది ఏంటి అంటే అక్కడ కార్యకర్తలు లేరు అని. కార్యకర్తల మీటింగ్ అని చెప్పి జగన్ పెట్టిన కుప్పం మీటింగులో నేతలే పాలుపంచుకున్నారు తమ్మ నిఖార్సైన ఒక్క కార్యకర్త కూడా లేనేలేడని, ఇంత చేసి జగన్ మీటింగ్ ఇలా తుస్సుమనిపించిందని తెలిసి అంతా ఉసూరుమంటున్నారు. చిత్రమేంటి అంటే కుప్పం మీటింగులో కూడా పాత ముఖాలే. వారే ఎమ్మెల్యేలు, భజన నాయకులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి బిగ్ షాట్స్ తప్ప నిజమైన కార్యకర్త అక్కడ ఏరీ అని బూతద్దంతో వెతికినా దొరకని పరిస్థితి ఉంది.
మరి ఎన్నికల వేళ కార్యకర్తలు ఎంతో ముఖ్యం. వారి వల్లనే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ రావాలి అనుకున్నా కూడా క్యాడర్ అవసరం ఇపుడు అధినాయకత్వానికి ఉంది. వారంతా మూడేళ్ళుగా నీరసించిపోయి ఉన్నారు. వారి బాధలు పట్టించుకునే వారు ఎవరూ లేరు. మరి అధినాయకుడు అయినా వారిని దగ్గరకు తీస్తే ఊరటగా ఉండేది. కానీ తొలి మీటింగులోనే కార్యకర్తలు లేరు అంటే ఇలాంటి మీటింగ్స్ ఎన్ని పెట్టినా ఏమిటి ప్రయోజనం అన్న విమర్శలు కూడా సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.
ఇక కుప్పం కార్యకర్తల మీటింగ్ అని పెట్టిన చోట ఎంపీటీసీలు, జెడ్పీటీస్లు, ఇతర నాయకులే ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలతో సహా తెగ వైరల్ అవుతోంది. మరి దీని చూసిన తరువాత మిగిలిన మీటింగ్స్ కధ కూడా ఇంతే ఎందుకొచ్చిన భేటీలు అని క్యాడర్ నిరాశపడితే ఆ తప్పంతా హై కమాండ్ దే కదా అంటున్నారు.
నిజానికి పదేళ్ళుగా పార్టీ జెండా మోస్తూ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలు భరోసా ఇవ్వాల్సిన నైతిక బాధ్యత అధ్యక్షుడిగా జగన్ మీద ఉంది. ఆయన మూడేళ్ళ పాటు అధికారిక కార్యక్రమాలలోనే పొద్దుపుచ్చారు. పోనీ ఇప్పటికైనా కళ్ళు తెరిచారు అనుకుంటే జగన్ మాత్రం క్యాడర్ లేని మీటింగులు నాలుగు గోడల మధ్యన పెట్టుకుని కూర్చుంటే లాభమేంటి అన్నదే పార్టీలో చర్చగా ఉంది. అదే టైమ్ లో 175 సీట్లు మనమే గెలవాలన్న స్లోగన్ తో జగన్ తాను చెప్పదలచుకున్నది చెబుతున్నపుడు. అవతల వారి గోడు విననపుడు ఎవరు ఎదుట ఉంటేనేంటి అన్న మాట కూడా ఉంది.
ఫీడ్ బ్యాక్ కోసం నిజానికి ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. ఎవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తులు చేసే సర్వేలను నమ్ముతూ వాటి ద్వారా పార్టీని నడిపించాలనుకోవడం కంటే తమ సొంత పార్టీ క్యాడర్ ను ముందు పెట్టుకుని మైక్ వారికే ఇచ్చి వారి నోటి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకుంటే వైసీపీకి మేలు జరిగేది. కానీ అలాంటిది ఏదీ తన వద్ద లేనే లేదని వైసీపీ పెద్దలు మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్నారు. జగన్ మైక్ అందుకుని తాను చెప్పాల్సింది చెప్పేసి ముగించడం వల్ల ఏ రకమైన ప్రయోజనం కూడా ఉండదని అంటున్నారు. ఇక్కడ మారాల్సింది జగన్ వ్యవహారశైలి అని అంతా అంటున్నారు. అలాగే నిజమైన క్యాడర్ ని పిలిపించుకుని వారి గోడు వింటేనే పార్టీకి మంచి రోజులు వస్తాయని కూడా చెబుతున్నారు.