ఏపీలో కొత్త పొత్తులు పొద్దు పొడుస్తాయని అని అంటున్నారు. బహుశా ఈ విషయాలు వైసీపీకి కూడా తెలియకుండా ఉంటాయా. అందుకే ఎందుకైనా మంచిదని బాబు మోడీని ఒకే గాటన కట్టి మరీ అప్పులలో ఇద్దరూ ఆరితేరిపొయినట్లుగా జగన్ అసెంబ్లీ సాక్షిగా చూపించారు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ చేసిన అప్పుల గురించి చెబుతూ కేంద్రాన్ని మోడీ సర్కార్ ని మధ్యలోకి లాగేశారు జగన్. ఇది రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు.
ఏపీలో అప్పులు తిప్పలూ గొప్పలూ అన్నీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినన్ని అప్పులు మేము చేయలేదని వివరించారు. పైగా ఆర్ధికాభివృద్ధిలో తామే భేష్ అన్నారు. ఏపీ ఈ రోజు దేశంలో ముందువరసలో ఉందని, పాజిటివ్ గ్రోత్ అన్నది తమ ప్రభుత్వం ఆచరణలో చూపించిందని జగన్ చెప్పారు.
ఏపీ శ్రీలంకగా మారుతుంది అని ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని, ఏపీలఒ ఆర్ధిక సుస్థిరత గత మూడేళ్ళలో నెలకొన్నది అని జగన్ గుర్తు చేశారు. కరోనా వంటి పెను విపత్తులో కూడా ఏపీ ఆర్ధికంగా దిగజారలేదని ఆయన అన్నారు. అంతే కాదు ప్రజల కొనుగోలుశక్తిని పెంచామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పధకాలు వల్లనే ఇది సాధ్యమైందని, ప్రజలు ఇబ్బంది పడకుండా తాము చూడడం వల్లనే ఇదంతా సాధ్యపడింది అని జగన్ చెప్పుకున్నారు.
ఇక అయిదేళ్ళ టీడీపీ మూడేళ్ల తన ఏలుబడిలో అప్పుల వివరాలను ఆయన బయట పెట్టారు.2014లో రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పు రూ.1,20,556 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఇక 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయేనాటికి అప్పు విలువ రూ.2,69,462 కోట్లుగా కాగ్ లెక్కల ప్రకారం నమోదైన గణాంకాలుగా వెల్లడించారు.
ఇక ఏపీలో 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం రూ.2.69 లక్షల కోట్లకు పెరిగిందని జగన్ చెప్పారు. ఇక వైసీపీ ఏలుబడిలో ఈ మూడేళ్లలో రూ.3.82 లక్షల కోట్లకు మాత్రమే అప్పులు పెరిగాయని ఆయన వెల్లడించారు. తన హయాంలో పెరిగిన అప్పులు కేవలం 12.73 శాతం మాత్రమేనని అది తమ ప్రభుత్వం ఘనత అని జగన్ అంటున్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు 123 శాతం పెరిగితే, వైసీపీ సర్కార్ ఏలుబడిలో గత మూడేళ్లలో 41.83 శాతం మాత్రమే అప్పులు పెరిగాయని జగన్ చెప్పారు.
ఇక జగన్ కేంద్రాన్ని సైతం వదిలిపెట్టలేదు. 2014-15లో కేంద్రం అప్పులు రూ.62,42,220 కోట్లుగా ఉంటే 2020-21 నాటికల్లా కేంద్రం అప్పులు రూ.120 లక్షల కోట్లు చేసిందని జగన్ వివరించారు. 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు రూ.59,09,965 కోట్లు అయితే 2019 మే 31 నాటికి ఆ రుణం రూ.94,49,372 కోట్లకు చేరాయని, తొలి అయిదేళ్ళలో కేంద్రం చేసిన అప్పులు 59.88 శాతం పెరిగాయి అని జగన్ లెక్కలతో సహా వివరించారు. ఇక 2022 మార్చి 31 నాటికి అవి ఏకంగా రూ.135 లక్షల కోట్లకు పెరిగాయని, అంటే ఏకంగా ఆ అప్పుల శాతం 43.8 గా ఉందని జగన్ చెప్పుకొచ్చారు.
ఇక్కడ జగన్ చెప్పేది ఏంటి అంటే ఏపీలో తాము చేసిన అప్పులు అన్నీ కూడా చాలా తక్కువ అని అవి కూడా సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నామని వివరించారు. చంద్రబాబు అయిదేళ్ళలో పెద్ద ఎత్తున అప్పులు చేసి కూడా ఏమీ చేయలేదని ఎత్తిచూపారు. ఇక మోడీ సర్కార్ పెద్ద ఎత్తున దేశంలో అప్పులు చేసిందని ఈ సందర్భంగా చెప్పడం ద్వారా బీజేపీకి కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు.
ఒకే దెబ్బకు అటు మోడీ ఇటు చంద్రబాబుకు కూడా అప్పులలో స్పెషలిస్టులు అన్న చందంగా జగన్ విడమరచి మరీ చెప్పడం ద్వారా రాజకీయంగానే టార్గెట్ చేశారని అంటున్నారు. మోడీని అసలు ప్రస్థావనకు తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. కానీ పదే పదే ఏపీలో అప్పులు అంటూ కేంద్ర పెద్దలు కూడా ఇటీవల పలు సందర్భాలలో అంటున్నారు. దానికి గట్టి రిటార్టుగానే జగన్ ఇలా మధ్యలో మోడీని తెచ్చారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.