బ్రేకింగ్: మూడు రాజధానులపై జగన్ సంచలన నిర్ణయం

Update: 2021-11-22 06:22 GMT
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ బిల్లు ప్రతిపాదించి కర్నూలును న్యాయరాజధానిగా.. విజయవాడను శాసన రాజధానిగా.. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, టీడీపీ నేతలు ఏడాదిన్నరగా ఉద్యమిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే హైకోర్టుకు వెళ్లి పిటీషన్లు వేసి అడ్డుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నా అదీ ముందుకు సాగడం లేదు. టీడీపీ ఎంత వ్యతిరేకిస్తున్నా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా మొండిపట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మూడు రాజధానుల బిల్లును సీఎం జగన్ వెనక్కి తీసుకోవడం సంచలనమైంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇదే జరిగితే పెను సంచలనం కానుంది.

ఇప్పటికే విశాఖకు రాజధానిని మార్చాలనుకున్నా హైకోర్టులో తేలేలా లేదు. పైగా ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే జగన్ తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని ఏపీకి మధ్యలో ఉన్న విజయవాడలోనే రాజధాని ఉంటే బాగుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News