బాబు హయాంలోనే కాళేశ్వరం.. కడిగేసిన జగన్!

Update: 2019-07-11 05:33 GMT
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును కడిగేశారు. ప్రాజెక్టుల గురించి చర్చ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ రాద్ధాంతంపై స్పందించిన జగన్ నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే కాళేశ్వరం మొదలు పెట్టారని.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచారని.. అప్పుడు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా అని పరుష పదజాలంతో జగన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు నీళ్లు లేవని.. రావడం లేదంటున్న టీడీపీ అధినేత అప్పుడేం చేశారని నిలదీశారు. తెలంగాణతో స్నేహపూర్వకంగా ఉంటూ తాము అభివృద్ధి చేసుకుంటున్నామని స్పష్టతనిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్ వెళ్లడాన్ని సభలో టీడీపీ తప్పుపట్టింది. దీనిపై జగన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. దీనికి కేసీఆర్ ఒప్పుకొని తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని జగన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచే గోదావరి నీటిని తీసుకొని శ్రీశైలం - నాగార్జున సాగర్ - కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News