ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. విష‌యం ఏంటంటే

Update: 2022-08-26 09:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ ర‌హితంగా తీర్చిదిద్ద‌ను న్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగా ఆయ‌న తొలి అడుగుగా.. నేటి(శుక్ర‌వారం) నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ల‌ను నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ఆయ‌న అన్నారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో 'పార్లే ఫర్‌ ది ఓషన్స్‌' సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించారాయన.

తొలుత‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను  వలంటీర్లు క్లీన్‌ చేశారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్‌ చెప్పారు.

దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోందని... అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలన్నారు. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని ఆయన పిలుపు ఇచ్చారు.

పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌..  2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ఆయన ధ‌రించారు.

ప్లాస్టిక్‌ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌.. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక  పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామ‌ని సీఎం జగన్‌ తెలిపారు. అనంతరం ఎంవోయూపై సంతకాలు జరిగాయి.
Tags:    

Similar News