50 సీట్లు బాగాలేవు.. అంటే.. 150 సీట్లు బాగా లేన‌ట్టుక‌దా.. లాజిక్ క‌రెక్టేనా?

Update: 2022-03-20 14:30 GMT
వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఇటీవ‌ల వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. నిజానికి ఈ స‌మావేశం నిర్వ‌హిం చి కూడా చాన్నాళ్లు అయిపోయింది. అయితే.. ఇప్పుడు ఎందుకు ఇంత హ‌ఠాత్తుగా నిర్వ‌హించారంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన 9వ‌ పార్టీ ఆవిర్భావ స‌మావేశంలో వైసీపీ కొమ్ములు విరిచేస్తాను.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తాం.. అంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు.. వైసీపీ వ్య‌తిరేక ఓటు ను కూడా చీల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఒకింత గంద‌ర‌గోళం చెందార‌నేది వైసీపీ నుంచి వ‌చ్చిన టాక్‌.

ఈ నేప‌థ్యంలో శాస‌న స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ హుటాహుటిన శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌ను చేయించిన స‌ర్వేల సంగ‌తిని ఎమ్మెల్యేల‌కు చెప్పారు. ఒక‌ర‌కంగా ఇది సందేశం అనే అటున్నారు ప‌రిశీల‌కులు.  వీటిలో మీడియాకి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌పై చేయించిన స‌ర్వేలో 50 మంది ఎమ్మెల్యే ప‌నితీరు బాగా లేద‌ని.. తేలింద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌. వీరు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంలేదు. నియోజ‌క‌వ ర్గాల్లోనూ ఉండ‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా పొరుగు రాష్ట్రాల‌పై క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు, తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ఃలో ఉంటూ.. వ్యాపారాలు వ్య‌వ‌హారాలు చేసుకుంటున్నార‌ని.. స‌ర్వేలో తేలింద‌న్నారు.

స‌రే! సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు 50 మంది పెర్ఫార్మెన్స్ బాగోలేదంటే.. మిగిలిన వాళ్లు ఎలా ప‌నిచేస్తున్నార‌నే సందేహం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఎందుకంటే..  వైసీపీ ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలు అంద‌రికీ ఒకటే రూల్ ఉంటుంది క‌దా.! మ‌రి మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది సాధార‌ణంగా.. వ‌చ్చే సందేహం. ఎందుకంటే.. ఎక్క‌డ చూసినా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి లేదు. నాయ‌కుల‌కు భ‌రోసా అంత‌కంటే లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చెమ‌టోడ్చి ప‌నిచేసి.. వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టిం చుకునేదిక్కు అంత‌క‌న్నా లేదు. కేవ‌లం అంద‌రికీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తే.. స‌రిపోతుందా? అనేది ప్ర‌శ్న‌.

మ‌రి అభివృద్ధి మాటేంటి? అనేది అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌స్తున్న ప్ర‌శ్న‌. ఎక్క‌డైనా ఒకే రూల్ ఉప‌న్న‌ప్పుడు.. ఆ 50 మంది మాత్ర‌మే ఎందుకు ప్ర‌త్యేకంగా వెనుక బ‌డ్డారు? అనేది ప్ర‌శ్న‌. ఉంటే.. అన్ని చోట్లా అదే ప‌రిస్థితి ఉండాలి క‌దా! కేవ‌లం 50 మందినే టార్గెట్ చేయ‌డం ఎందుకు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. సో.. 50 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాదు.. మొత్తం 150 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి దారుణంగానే ఉండి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. సీఎం మిగిలిన వారివి దాచిపెట్టి కేవ‌లం 50 మందినే టార్గెట్ చేసుకున్నారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. 
Tags:    

Similar News