జగన్ - రాజ్ నాథ్.. ఏపీ కోసం కీలక నిర్ణయం

Update: 2019-06-30 06:28 GMT
పాకిస్తాన్ మన శత్రుదేశం.. ఇక పశ్చిమ భారత దేశ తీరప్రాంతమంతా గస్తీ బాగానే ఉంటుంది. మరీ తూర్పు తీరం సంగతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తూర్పు తీరంలోనే ఉన్నది. తూర్పున ప్రమాదం లేదనకుంటే పొరపాటే.. ఎందుకంటే పాకిస్తానీ తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించడానికి బంగ్లాదేశ్ - మయన్మార్ - శ్రీలంకల మీదుగానే దేశంలోకి సముద్రమార్గాన ప్రవేశిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. మొన్నటి శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారులు కూడా ఇలానే వచ్చి నెల్లూరు జిల్లా తీరంలో శ్రీలకం బోటును వదిలేశారన్న వదంతులు వచ్చాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు భారత తూర్పు నౌకదళాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. దీనికి తాజాగా పూర్తి సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళా ప్రధాన కేంద్రంలో తూర్పు నౌకదళ మౌళిక వసతుల ప్రాజెక్టులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ - కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.  భారత నౌకాదళాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నౌకదళ అధికారులకు రాజ్ నాథ్ సింగ్ సూచించారు. దాదాపు అరగంట పాటు వీరు చర్చలు జరిపారు.

అనంతరం నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరీ డైనింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన విందులో రాజ్ నాథ్ సింగ్ - జగన్ - నావికాదళ అధికారులు - రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ఇక రాజ్ నాథ్ మీటింగ్ అయిపోయాక ఆయన వాహనం వద్దకు వచ్చి మరీ జగన్ సాగనంపారు.
Tags:    

Similar News