రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూములు లీజుకిచ్చిన రైతులను నెత్తిన పెట్టుకుంటామని.. ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు. అంతేకాదు.. వారికి ఎకరానికి ఏడాదికి 30 వేల రూపాయలు ఇచ్చే విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు. రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుందని, బీడు భూములను లీజు విధానంలో తీసుకుని, ఏటా ఎకరాకు దాదాపు 30 వేలు చెల్లించేలా నూతన విధానం తీసుకువస్తున్నామన్నారు.
అంతేకాక రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని తాజాగా సీఎం జగన్ చెప్పారు. ఓకే.. మంచిదే. ఎవరూ కాదనరు. రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు కాబట్టి.. వారికి మేలు చేయాల్సిందే.
ఈ విషయంలో రెండో థాట్ ఎవరికీ లేదు. అయితే.. బీడు భూములకే ఏడాదికి 30 వేల చొప్పున కౌలు చెల్లిస్తామని ప్రకటిస్తున్న జగన్.. మరి రాజధాని అమరావతి కోసం.. పచ్చటి పంటలు పండే పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేరా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఇక్కడి రైతులు.. ఇచ్చింది.. పరిశ్రమల కోసం.. ప్రజలకు అత్యంత కీలకమైన రాజధాని కోసం.
పైగా.. తాము పంటలు పండించి.. ప్రజల ఆకలి తీరుస్తున్న భూములను.. తమ జీవనోపాధిని కూడా పణంగా పెట్టి మరీ.. ప్రభుత్వానికి అమరావతి రైతులు.. 33 వేల ఎకరాల భూమిని అప్పగించారు. మరి వీరు రైతులు కారా? వీరివి త్యాగాలు కావా? అనేది సాధారణ ప్రజల ప్రశ్న.
బీడు భూములంటే.. ఎందుకూ పనికిరాని భూములు. మరి అవితీసుకునే.. 30 వేల చొప్పున సొమ్ములు ఇస్తూ.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్న జగన్ సర్కారు.. రాజధాని కోసం.. సర్వం త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలి కదా! వారికి కూడా ఇస్తామన్న కౌలు ఇవ్వాలి కదా.. కానీ.. ఇప్పటి వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా కౌలు ఇవ్వలేదు.
అంతేకాదు.. హైకోర్టు .. ఇక్కడి భూములను డెవలప్ చేసి.. మూడు మాసాల్లో ఇవ్వాలని ఆదేశించినా.. ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. రాజధానిపై ఎలాంటి ప్రకటనను కూడా చేయలేదు. అమరావతినే రాజదానిగా కొనసాగించాలని చెప్పినప్పటికీ.. హైకోర్టు మాటలను ఇప్పటికీ.. జగన్ సర్కారు పట్టించుకోలేదు.దీంతో రాజధాని రైతులు చేసిన త్యాగం.. నగుబాటుగా మారింది. కానీ, బీడు భూములు తీసుకుని.. అక్కడి రైతులు చేస్తున్న త్యాగాలను వెలకట్టలేనివని జగన్ వ్యాఖ్యానించడం.. అత్యంత శోచనీయంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా.. అమరావతి రైతులకు న్యాయం చేయాలని సూచిస్తున్నారు.