ఏపీ శాసన మండలి రద్దు విషయం సమసిపోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్రలోని జగన్ సర్కారు హడావుడి హడావుడిగా చేసిన మండలి తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. అయితే.. ఇది జరిగి ఏడాది గడిచినా.. ఇప్పటి వరకు కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఇక, ఇది సమసిపో యిందని.. తద్వారా తాము గట్టెక్కేశామని.. వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. తీర్మానం చేసే నాటికి.. మండలిలో వైసీపీ మెజారిటీ తక్కువగా ఉండి.. టీడీపీకి మెజారిటీ ఎక్కువగా ఉంది.
దీంతో తమ నిర్ణయాలకు టీడీపీ మండలిలో అడుగడుగునా.. అడ్డు పడుతోందని భావించిన వైసీపీ సర్కా రు.. మండలిని రద్దు చేస్తూ.. తీర్మానం చేసింది. కానీ, ఏడాది తిరిగే సరికి.. దీనిపై నిర్ణయం రాకపోగా.. మరో వైపు అదే మండలిలో ఇప్పుడు వైసీపీ మెజారిటీ దక్కించుకుంది. దీంతో తమకు మండలిలో ప్రాధాన్యం దక్కడంతోపాటు.. రాజకీయ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిని జగన్ మండలికి పంపుతున్నారు. దీంతో అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఒక్కసారిగా కేంద్రం బాంబు పేల్చింది.
మండలిరద్దుపై ఏపీ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పరిశీలిస్తున్నట్టు మంగళవారం.. రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ``ఏపీ మండలి రద్దు తీర్మానం.. పరిశీలనలో ఉంది. సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటాం`` అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో టీడీపీ సభ్యుడు కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో అలజడి రేగింది.
మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీసీఆర్ డీఏ రద్దు వంటి ప్రతిపాదనలను జగన్ సర్కారు చేసిన సమయంలో టీడీపీ అసెంబ్లీలో బలం లేని కారణంగా అడ్డుకోలేక పోయింది. దీంతో మండలిలో బలంగా ఉన్న నేపథ్యంలో సదరు బిల్లులు అక్కడ వీగిపోయాయి. దీంతో ఆగ్రహోదగ్రుడైన.. సీఎం జగన్.. వెంటనే మండలి రద్దుకు ప్రతిపాదించారు. దీనివల్ల ఖర్చు తప్ప.. ఉప యోగం లేదని.. పేర్కొన్నారు. అంతేకాదు.. కీలక నిర్ణయాలను అడ్డుకుంటున్నారని.. టీడీపీ ఎమ్మెల్సీలను దుయ్యబట్టారు.
ఈ క్రమంలో అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని.. కేంద్రానికి పంపారు. ఇప్పుడు దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సింది. ఇదిలావుంటే.. ఈ తీర్మానం కేంద్రానికి చేరికూడా.. ఏడాదిన్నర అయినప్పటికీ.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అంటే.. మండలిలో వైసీపీకి బలం లేనప్పుడు.. ఒకటికి రెండు సార్లు ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో జగన్ చర్చించారు కూడా. మరోవైపు మండలిలో ఖాళీ అవుతున్న స్థానాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ.. వచ్చారు.
వాస్తవానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. రాష్ట్ర ప్రబుత్వం చేతుల్లో ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే.. కేంద్రం ఈ విషయాన్ని ప్రత్యేక హోదా మాదిరిగా అటకెక్కించిందని అందరూ అనుకున్నారు. ఇక, మండలి రద్దు కాదని.. వైసీపీకి పండగేనని భావించారు. కానీ, అననూహ్యంగా.. కేంద్ర మంత్రి రిజుజు చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు రేపుతుండడం గమనార్హం.
అయితే.. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరింది. దీనికి కారణం.. అక్కడ సీఎం గా ఉన్న మమతా బెనర్జీ.. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమెను మండలి నుంచి నామినేట్ చేసుకునేందుకు పార్టీ తహతహలాడుతోంది. దీంతో మండలిని పునరుద్ధరించాలని కోరుతోంది. అయితే.. మమత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ం తిరస్కరించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ మండలి రద్దును కూడా చేసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ.. మండలిని కొనసాగించాలని.. జగన్ కనుక భావిస్తే.. మరోసారి దీనికి సంబంధించిన తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.