ఔను! కొంత నిష్టూరంగా అనిపించినా ఇది నిజం. డీజీపీగా ఎవరూ దక్కించుకోనంత కాలం పదవి కాలం దక్కించుకుని.. ఎవరికీ లేనంత స్వేచ్ఛను కూడా పొదివి పుచ్చుకున్న ఏకైక అధికారి గౌతం సవాంగ్. ఎందుకంటే.. నవ్యాంధ్రలో చంద్రబాబు హయాం నుంచి కూడా అనేక మంది డీజీపీలుగా పనిచేశారు.
తొలి డీజీపీగా రాముడు, తర్వాత.. సాంబశివరావు, తర్వాత.. మాలకొండయ్య, తర్వాత.. ఠాకూర్ పనిచేశారు. అంటే.. మొత్తం ఐదేళ్ల కాలంలో నలుగురు పనిచేశారు. ఎంత లేదన్నా..ఒక్కొక్కరికీ ఏడాదిన్నరకు మించి న సమయ డీజీపీగా ఉండే ఛాన్స్ లభించలేదు.
కానీ, 2019 జూన్‌లోడీజీపీగా బాధ్యతలు చేపట్టిన సవాంగ్.. ఏకంగా.. రెండు సంవత్సరాల తొమ్మిది మాసాలు పదవిలో ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన డీజీపీ మరొకరు మనకు లేరు.
అలాంటి అవకాశం ద క్కించుకున్న గౌతం సవాంగ్ వ్యవహరించిన తీరు... ఆద్యంతం విమర్శల పాలైంది. అక్రమ నిర్బంధాలు, ముందస్తు సమాచారం లేకుండానే అరెస్టులు.. మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జీలు.. అమరావతి ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం.. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి జరిగితే.. బాధ్యతా రహితంగా వ్యవహరిం చడం.. అంతేకాదు.. టీడీపీప్రధాన ఆఫీస్‌పై దాడి జరిగితే.. వారిలో వారే కొట్టుకుని ఉంటారని వ్యాఖ్యానించడం వంటివి డీజీపీ స్థాయిని దిగజార్చాయి.
అంతేకాదు.. రాజకీయంగా కూడా డీజీపీ గౌతం సవాంగ్ ఎదుర్కొన్న విమర్శలు.. అన్నీ ఇన్నీ కావు. ఆయన జగన్ పార్టీ డైరెక్టర్ అని.. వైసీపీకి అధికారి అనీ.. ఇలా అనే విమర్శలు మోశారు. దీనికి కారణం.. పోలీసు మాన్యువల్‌ను పక్కన పెట్టి.. వ్యవహరించడం.. కనీసం.. క్షేత్రస్థాయిలోనూ.. నిక్షాక్షికంగా.. సేవలు చేరువ చేయలేక పోవడంమే కారణం.
విపక్షం అయితే.. చాలు.. విభన్నంగా వ్యవహరించాల్సిందే! అనే సంకేతా లను క్షేత్రస్థాయిలోకి పంపించి.. కోర్టుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. పోలీసు మాన్యువల్‌ను.. కోర్టులో చదివి వినిపించే పరిస్థితికి కూడా ఆయన దిగజారే పరిస్థితిని తెచ్చుకున్నారు.
రెండున్నరేళ్ల సుదీర్ఘ పదవీకాలంలో డీజీపీగా సవాంగ్ వేసిన మైలు రాళ్లు కనిపించడం లేదు. పైగా.. సచివాలయానికి ఎంపికైన.. మహిళా ఉద్యోగులను పోలీసులుగా మారుస్తామన్న.. ప్రబుత్వానికి ఆయన వంత పాడారు.
సాయుధ బలగాలు, పోలీసు చట్టం ప్రకారం.. అనుసరించకుండా.. కేవలం పైవారు చెప్పారనే రీతిలో తలూపి.. న్యాయవ్యవస్థ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇలా.. ఎలా చూసుకున్నా.. సవాంగ్ రెండేళ్ల అధికార కాలం.. పోలీసులకు ఎలా వ్యవహరించాలో.. ఎలా వ్యవహరించకూడదో.. అనే విషయంలో ఒక పాఠం అయితే.. పోలీసు వ్యవస్థలోనే ఇది చరిత్రగా నిలిచిపోతుందని అంటున్నారు పరిశీలకులు.