ఏపీ ఎకాన‌మీ : ప్ర‌త్య‌క్ష ప‌న్నులు ఇంకా పెరుగుతాయట

Update: 2022-05-28 11:32 GMT
ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రంగా ఆంధ్రావ‌నికి ఇప్ప‌టికే పేరుంది. కేంద్రం కూడా కొత్త అప్పులు గురించి కొర్రీలు పెడుతూనే ఉంది. ఆ విధంగా కేంద్రంతో కొన్ని సంప్ర‌తింపులు జ‌రిపాక కొన్ని సార్లు అవ‌స‌రానికి మించి అప్పు కూడా తీసుకున్న దాఖ‌లాలు ఉన్నాయి.

క్యాపిట‌ల్ వెంచ‌ర్ పేరిట తాజాగా మూడు వేల ఐదు వంద‌ల కోట్ల రుణాల‌కు ప్ర‌యత్నాలు చేస్తోంది ఏపీ స‌ర్కారు.  అంటే రాజ‌ధానిలో అభివృద్ధికి మ‌రియు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కూ ఆ నిధులు వెచ్చించాల‌న్న‌ది నిర్ణ‌యం. ఆ నిధులు వ‌చ్చేలోగానే కొన్ని ప్ర‌త్య‌క్ష ప‌న్నుల పెంపు విష‌య‌మై కూడా ఏపీ స‌ర్కారు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. పాత అప్పుల కొల పాత్ర నిండిపోయిన దృష్ట్యా , కొత్త అప్పుల కోసం అన్వేషించ‌డ‌మే కాదు.కొంతలో కొంత ఆదాయ మార్గాల పెంపున‌కు కూడా దృష్టి నిలుపుతోంది.

ఇప్ప‌టికే పుర‌పాల‌క సంఘాల‌లో, గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో చెత్త ప‌న్ను వ‌సూలుకు ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యం ఉంది. వీటితో పాటు ఆస్తి ప‌న్ను ఓ ఐదు శాతం అద‌నంగా వ‌సూలు చేయాల‌ని భావిస్తోంది. త‌ద్వారా ఏటా 35 కోట్ల రూపాయ‌లు అద‌నంగా ప్ర‌భుత్వానికి చేరనున్నాయి. ఆస్తి ప‌న్ను ఇప్ప‌టికే కొంత భారీ మొత్తంలో వ‌సూల‌యి ఉంది. ఇటీవ‌ల లెక్కల ప్ర‌కారం నాలుగు వంద‌ల కోట్లకు పైగా ముంద‌స్తు ఆస్తి ప‌న్నుల చెల్లింపు ప‌ద్ధ‌తి ద్వారా చేరుకుంది.ఇప్పుడు ఆస్తి ప‌న్ను ఐదు శాతం పెంపు ద్వారా ఈ మూడేళ్ల‌కు అద‌నంగా మ‌రో వంద కోట్లు చేర‌నుంది.

మూడేళ్ల లెక్క‌ల ప్రకారం ( ఈ ఏడాదితో క‌లుపుకుని 2024 వ‌ర‌కూ) ఆస్తి ప‌న్ను పెంపుద‌ల  అన్న‌ది క్ర‌మ క్ర‌మంగా పెంచుకుంటూ పోవాల‌న్న‌ది ప్ర‌భుత్వం యోచ‌న అని తెలుస్తోంది.  అంటే ఎన్ని విమర్శలు వస్తున్నా బాదుడే బాదుడు ఆపడానికి జగన్ సర్కారుకు అవకావం లేదు అన్నమాట కూడా వినిపిస్తోంది.

ముంద‌స్తు చెల్లింపులు అనూహ్యంగా ఉండ‌డంతో ఆ ప‌ద్ధ‌తిని ప్రోత్స‌హిస్తే రానున్న కాలానికి ఎలా చూసుకున్నా 1500 కోట్లు ఆదాయం కేవ‌లం గ్రామీణ ప్రాంతాల నుంచే స‌మ‌కూర‌నుంది. అదేవిధంగా జీఎస్టీ ప‌రంగా కూడా ఆదాయం ఎంతో  బాగుంది. వీటితో పాటు క‌మ‌ర్షియ‌ల్ బోర్డుల‌పై గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూడు వేలు నుంచి ఐదు వేలు సేక‌రిస్తూ ఉన్నారు. అంటే ప‌న్ను రూపంలో  ఏడాదికి వీటి నుంచి ఒక్కో మున్సిపాల్టి నుంచి ఆశించిన విధంగా ఆదాయం వ‌స్తే వంద కోట్లు ఖ‌జానా గూటికి చేరుతాయి. అంటే  ఓ ఏడాదికి ఏ పెద్ద స్థాయి మున్సిపల్ ఆఫీసు నుంచి  ఓ మోస్త‌రు స్థాయిలో వంద కోట్ల ఆదాయం రావ‌డం ఖాయం. రానున్న మూడేళ్ల‌కూ ఏపీ ఆదాయం  కేవ‌లం క‌మర్షియ‌ల్ బోర్డుల నుంచే త‌క్కువ‌లో త‌క్కువ ఓ 300 కోట్లు కావ‌డం ఖాయం.

ఇంత‌గా ఆదాయం వ‌స్తున్నా నేరు ప‌న్నులు అదేవిధంగా ప‌రోక్ష రీతిలో ప‌న్నులు ఏటా పెంచుకుంటూ వెళ్తున్నా ఎప్ప‌టి కప్పుడు ఖ‌జానా మాత్రం ఖాళీ గానే క‌నిపించ‌డం, కొంద‌రు చిన్న స్థాయి ఉద్యోగుల‌కు (కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ) రెండు నుంచి మూడు నెలల పాటు జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డం వంటి పరిణామాలు ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌కు సంకేతాలు..అని విపక్షం విమ‌ర్శిస్తోంది.
Tags:    

Similar News