ఏపీ ఎన్నికల కమిషనర్ ఎంపికపై కొత్త ఆర్డినెన్స్ ఏం చెబుతోంది?

Update: 2020-04-11 05:00 GMT
ఎన్నికల్ని మరింత నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఏపీలోని జగన్ సర్కారు. ఎన్నికల కమిషనర్ ను ఎలా ఎంపిక చేయాలో చెబుతూ.. ఇప్పుడున్న విధానాన్ని మార్చేశారు. దీనికి సంబంధించిన మార్పుల్ని తాజాగా విడుదల చేసిన ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. పంచాయితీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 200కు మార్పులు చేయటం ద్వారా.. ఎంపిక విధానం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటివరకూ ఐఏఎస్ అధికారులు నిర్వహించిన ఈ పదవిని.. ఇకపై హైకోర్టు మాజీ న్యాయమూర్తుల్ని ఎంపిక చేయనున్నారు.

పారదర్శకతను పెంచేందుకు.. నిష్పాక్షికతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిపేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఈ విధానం సరికొత్త మార్పుగా చెబుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఒరవడిగా మారే అవకాశం ఉంది. రిటైర్డు జడ్జి నేతృత్వం లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం దేశంలో ఇదే తొలిసారిగా మారుతుందని చెప్పక తప్పదు.

తాజాగా విడుదలైన ఆర్డినెన్స్ ప్రకారం చూస్తే.. కొత్తగా చేపట్టిన మార్పులు ఏమంటే?
% ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించినట్లుగా ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. మరో మూడేళ్ల పదవీ కాలాన్ని గవర్నర్ తన అభీష్టం మేరకు పొడిగించే వీలుంది.
% ఒక వ్యక్తి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా గరిష్ఠంగా రెండు దఫాలు మాత్రమే పదవిని చేపట్టేలా నిర్ణయం. అంటే.. మూడేళ్లు.. మూడేళ్లు.. రెండు టర్మ్ లుగా మాత్రమే నియమితులవుతారు. అంటే.. ఆరేళ్లకు మించి మరెవరూ ఆ పదవిలో కొనసాగే అవకాశం లేదు
% తాజాగా విడుదలైన ఆర్డినెన్స్ ప్రకారం ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు ముగిసినట్లే. ఎందుకంటే 2016 ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్నికల కమిషనర్ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఆయన పదవీకాలం పూర్తవుతుంది.
Tags:    

Similar News