ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం తప్పదు: ఏపీ ఉద్యోగ సంఘం నేత హెచ్చరిక!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ప్రతి నెలా తమకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తుండటం, తమ డీఏ బకాయిలను చెల్లించకపోవడం, జీపీఎఫ్ బకాయిల పరిస్థితి ఇలాగే ఉండటం, వీటిపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినెలా 20వ తేదీ వస్తే కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు పడటం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజం లేదని తెలిపారు. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని వెల్లడించారు.
తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తమ డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం తమకు రావాల్సినవి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కొత్త జీవోల ఊసే లేకుండా పోయిందని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎవరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వట్లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సైతం ఇప్పటికీ అలవెన్సులేమీ ఇవ్వలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. దీనిపై ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదన్నారు. కరోనా బారినపడి వందల మంది చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదని హాట్ కామెంట్స్ చేశారు. పదవీ విరమణ చేసినవారికి ప్రయోజనాలు అందించడం లేదని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.