తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది హద్దు.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది మొదలు.. 'ఏపీ ఎక్స్‌ప్రెస్' విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశరాజధాని ఢిల్లీకి నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ పేరును మార్చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి అనేక మంది డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంలో కేంద్ర రైల్వేశాఖమంత్రిపై కూడా ఒత్తిడి తీసుకు వచ్చారు!
మరి వారి ప్రయత్నాలు ఫలించాయి. అధికారికంగా 'ఏపీ ఎక్స్‌ప్రెస్' పేరు మారింది. ఇక నుంచి అది 'తెలంగాణ ఎక్స్‌ప్రెస్' గా ఢిల్లీకి నడుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ పరిధిలో నడుస్తున్న ఒక రైలుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరుంది. దాన్ని 'కొమురం భీమ్' ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 'తెలంగాణ ఎక్స్‌ప్రెస్'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు!
అయితే 'ఏపీ ఎక్స్‌ప్రెస్' ప్రస్థానం ఆగిపోలేదు. విజయవాడ నుంచి ఢిల్లీకి నడిచే ఎక్స్‌ప్రెస్ కు 'ఏపీ ఎక్స్‌ప్రెస్' అని పేరు పెట్టారు. తద్వారా ఆ ఎక్స్‌ప్రెస్ రైలు ఉనికిని అలాగే ఉంచారు. మొత్తానికి రాష్ట్రాల విభజన అన్ని విధాలుగానూ జరిగిపోతోంది. ఎవరికి వారు కావడంలో తెలుగు వాళ్లు చాలా వేగంగానే స్పందిస్తున్నారు.