చంద్రబాబుకు ఝలక్.. క్యాట్ లో ఏబీవీకి చుక్కెదురు

Update: 2020-03-17 08:01 GMT
సస్పెన్షన్ కు గురైన ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్రభుత్వ నిర్ణయం సరికాదని చెబుతూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్) ను ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ వెంక‌టేశ్వ‌ర‌రావు క్యాట్ ను ఆశ్ర‌యించగా అక్కడ నిరాశ ఎదురైంది. దీంతో ఆ పిటిష‌న్ పై విచారించిన క్యాట్ ఆయ‌న స‌స్పెన్ష‌న్ స‌మ‌ర్థ‌నీయ‌మే అని క్యాట్ ప్ర‌క‌టించి ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో వెంక‌టేశ్వ‌ర‌రావు వాద‌న తేలిపోయింది. ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకోవాలని క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావుకు సలహా ఇచ్చింది. ఏబీ ఇంటెలిజెన్స్ డీజీగా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపైన క్యాట్‌ను ఆశ్రయించి తనపై విధించిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తూ తనపై నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేశారని క్యాట్‌ ముందు వాపోయారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు వెంక‌టేశ్వ‌ర‌రావు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా అవినీతి, అక్రమాలకు పాల్ప‌డ్డారని ప్రభుత్వం గుర్తించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు స‌న్నిహితుడిగా పేరు ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఊడిగం చేశార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చాక జగన్ వెంక‌టేశ్వ‌ర‌రావు అవినీతిని బహిర్గతం చేసి అతడిని ఫిబ్రవరి 8వ తేదీన స‌స్పెన్ష‌న్ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారు. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్స్‌ విధానాలను సైతం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడంతో ఆ మేరకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. అయితే అతడి సస్పెన్షన్ తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకించడం గమనార్హం. దీంతో వారిద్దరి మధ్య బంధం తెలుస్తోంది. నిఘా వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ప‌రిక‌రాల కొనుగోలు వ్య‌వ‌హారంలో ఏబీవీ పై దేశ‌ద్రోహం కేసే న‌మోదైంది.
Tags:    

Similar News