ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ... లాటరీ పద్దతిలో ఇంటి స్థలాలు !

Update: 2020-03-04 07:30 GMT
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా తీసుకోని , అమలు చేయదలచిన ఇంటిస్థలాల పంపిణీ కార్యక్రమం పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ ని పురష్కరించుకొని , ఉగాది కానుకగా 25 లక్షల మందికి ఇంటి స్థలాలని కేటాయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే .. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. లాటరీ విధానం లో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఉగాది నాడు ఇవ్వబోతున్న .. ఇంటి స్థలాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ, వార్డు వారీగా అర్హులైనవారి జాబితా సిద్ధంగా ఉంది. దీనితో బుధవారం నుంచి లాటరీ పద్దతి లో లబ్ధిదారులను ఎంపిక చేసి , అలా లాటరీ ద్వారా ఎంపికైన వారందరికీ ఈ నెల 15 నుండి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలని, అలాగే ఈ నెల 25న ఉగాది నాడు రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను లబ్దిదారులకు అందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషా రాణి తమ ఉత్తర్వుల్లో తెలిపారు. కాకినాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లో 25 లక్షల మందికి ఇంటి స్ధలం పట్టాలని పంపిణీ చేపట్టాల్సిందేనంటూ తన ఉత్తర్వుల్లో ఆమె స్పష్టం చేశారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని జిల్లా కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు.
Tags:    

Similar News