ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆ శాఖకు చురుకుదనం వచ్చింది. విధి నిర్వహణలో సీతయ్యలా వ్యవహరించే ఆయన బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే విజయవాడలో మెరుపుదాడులు చేశారు. అది జరిగిన మూడు రోజులకే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ దాడులు మొదలయ్యాయి. పలు కార్యాలయాల్లో నగదు లభించింది. అయితే.. కార్యాలయాల్లో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో తెలుసుకోవడం లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ కార్యాలయాల నుంచి కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.
శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖ, అనంతపుం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కదిలినట్లు తెలుస్తోంది.
వారం కిందట అవినీతి నిరోధక శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడం, ఆ శాఖ డీజీగా అప్పటికి ఉన్న విశ్వజిత్ స్థానంలో పీఎస్సార్ ఆంజనేయులును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఏ శాఖలో ఉన్నా తనదైన ముద్ర వేసే అధికారి పీఎస్సార్ ఆంజనేయులు రాకతో ఏసీబీకి కొత్త ఊపు వచ్చింది. సీఎం జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రంలో అవినీతి అంతానికి కదం తొక్కడం ప్రారంభమైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజా దాడుల్లో రిజిస్టర్ ఆఫీసుల్లో భారీ మొత్తంలో అనధికార నగదు కూడా దొరుకుతుండడంతో ఆ శాఖ అధికారుల్లో దడ మొదలైంది. ఏసీబీ జోరుతో రాష్ట్రంలోని ఇతర శాఖల్లో అవినీతిపరుల్లోనూ భయం మొదలైంది.