పుష్కరాలంటేనే అధ్యాత్మిక కార్యక్రమం. మరి.. వాటిని బాగా జరిపించాలన్న ఉద్దేశంతో దశాబ్దాల తరబడి ఉన్న గుళ్లను రాత్రికి రాత్రే కొట్టించేయటం ఇప్పుడు పెను వివాదంగా మారింది. విజయవాడలోని పలు గుళ్లు.. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో గత కొద్ది రోజుల్లో అధికారులు నిర్మోహమాటంగా కొట్టేయించటంపై బెజవాడలోని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 30 వరకూ ఆలయాల్ని కూల్చివేయగా.. మరో 11 ఆలయాల్ని కూల్చివేయటానికి రంగం సిద్ధం చేయటంతో బెజవాడ ఉద్రిక్తతలతో ఊగుతోంది.
ఆలయాల్ని కూల్చేయటం మహాపచారమని.. పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దేవాలయాల్ని కూల్చివేయాలని అనుకున్నప్పుడు వాటిని పద్ధతి ప్రకారం కూల్చి వేయకుండా రాత్రికి రాత్రి ప్రొక్లయిన్లతో కూల్చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇలా ఆలయాలు కూల్చేయటం సరికాదని.. దీని వల్ల వేలాదిమంది భక్తులు మనోభావాలు దెబ్బ తింటున్నాయని స్థానికులు వాపోతుంటే.. ఈ తరహా కూల్చివేతలు మహాపచారమని మఠాధిపతులు.. పీఠాధిపతులు మండిపడుతున్నారు.
సీతమ్మ వారి పాదాల సమీపంలో కనీసం నోటీసు ఇవ్వకుండా ఆంజనేయస్వామి గుడిని కూల్చి వేయటమే కాదు.. ఆంజనేయస్వామి విగ్రహాన్ని పాత వస్తు సామాగ్రిని మూట కట్టినట్లుగా కట్టేసి వాహనంపై తరలించటంపై అక్కడి వారు మండిపడుతున్నారు. ఇక.. పురాతనమైన సీతమ్మవారి పాదాలు.. రాష్ట్రంలో రెండోదిగా పేరున్న శనీశ్వర ఆలయం.. రాహుకేత ఆలయం.. కృష్ణా తీరంలోని భూగర్భ వినాక ఆలయం.. సాయిబాబా మందిరం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే దేవాలయాల్ని కూల్చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు వస్తుందని తలచినప్పుడు.. ఆయా వర్గాల వారిని సంప్రదించి.. ఒక పద్ధతి ప్రకారం.. శాస్త్రోక్తంగా దేవాలయాల్ని తీసివేస్తే బాగుండేదని.. అందుకు భిన్నంగా రాత్రికి రాత్రి ప్రొక్లయిన్లు తీసుకొచ్చి కూల్చేయటం ఏ మాత్రం సబబుగా లేదని ఆర్చకులు చెబుతున్నారు. టీడీపీ సర్కారు తీరుపై.. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సైతం విరుచుకుపడుతున్నారు. ఎవరూ నొచ్చుకోకుండా ఉండేలా పాలన సాగించేందుకు మొగ్గు చూపుతున్న చంద్రబాబు అందుకు భిన్నంగా లక్షలాది ప్రజల సెంటిమెంట్లకు నెలువైన దేవాలయాల్ని ముందువెనుకా చూడకుండా కొట్టించేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఉదంతంలో బాబు తప్పటడుగులు వేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.