ప్రజల వద్దకే పాలన అంటూ 'గ్రామ, వార్డు' సచివాలయ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ భారీ సంస్కరణకు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 15వేల గ్రామ సచివాలయాల్లో 1.30 లక్షల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. వీరి నియామకం పూర్తై రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకూ ప్రొబేషన్ ఖరారు చేయలేదు. ఉద్యోగాలు పర్మినెంట్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇకపై వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అంటే రోజుకు మూడు సార్లు యాప్ ద్వారా అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్మార్ ఫోన్లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని హాజరు వేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది. ఈ విధానం శనివారం నుంచి అమల్లోకి రానుంది.
ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రొబేషన్ ఖరారు చేయకుండా తమ ఉద్యోగాలను ప్రశ్నార్థకం చేసిన ప్రభుత్వం మూడు సార్లు హాజరు వేసుకోవాలనడంప సరికాదని అంటోంది.
అయితే ఉన్నతాధికారులు మాత్రం ప్రతిరోజూ జరిగే స్పందన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చినప్పుడు స్పందన సమయంలో సచివాలయంలో ఉన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి మాత్రమే మూడు సార్లు హాజరును అమలు చేస్తున్నామంటున్నారు.
సచివాలయ ఉద్యోగులు చాలాచోట్ల ఉదయం 10 గంటలకు బయో మెట్రిక్ వేసి ఫీల్డ్ విజిట్ పేరుతో బయట ఉంటున్నారు. మళ్లీ సాయంత్రం బయోమెట్రిక్ వేస్తున్నారన్న ఆరోపణలున్నట్లు అధికారులంటున్నారు. దీనివల్ల స్పందనలో వచ్చే ఫిర్యాదులు నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హాజరుకు ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం.. రెండు రోజుల క్రితమే డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు నివారించేందుకు వాటిని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వాలంటీర్లను నియమించింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా దాదాపు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేరుస్తున్న వాలంటీర్లు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో వారికి సీఎం జగన్ ఓ బహిరంగ లేఖ రాశారు.