తర్జనభర్జనల నడుమ ప్రజల కోరికనే ఫలించింది. కరోనా మహమ్మారికి మందు లేని ఈ రోజుల్లో దాని నివారిస్తున్నట్టు బాధితులు చెబుతున్న ఆనందయ్య మందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఓకే చెప్పింది.
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం.. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇచ్చే ‘పీ’, ఎల్, ఎఫ్ రకం మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంట్లో వేస్తున్న డ్రాప్స్ మందు ‘కే’కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ‘కే’ మందు తప్ప మిగతా ఆనందయ్య మందులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కంట్లో వేసే మందుపై పూర్తి నివేదిక 3 వారాల్లో వస్తుందని అప్పటిదాకా వేచి ఉండాలని సూచించింది.
అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి శాస్త్రీయ నిర్ధారణలు లేవని సీసీఆర్ఏఎస్ నివేదికలు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని సూచించింది. ఆనందయ్య ఇచ్చే మందులు వాడొచ్చని స్పష్టం చేసింది.
ఇక ఆనందయ్య మందుపై ఏపీ ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది. అనుమతి వచ్చిందని ఆనందయ్య ఔషధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కోవిడ్ రోగులు రావద్దని.. వారి బంధువులే వెళ్లాలని సూచించింది.మందు పంపిణీ వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక ఆనందయ్య మందును ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయాలని ఆనందయ్య, ఇతరులు వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరింది. ఈరోజు ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం చెబుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిపై హైకోర్టుకు తెలుపాల్సి ఉంటుంది.