నిరుద్యోగ యువతకు జగన్ గుడ్ న్యూస్!

Update: 2020-08-25 00:30 GMT
మొన్నటి కేబినెట్ భేటిలో లబ్ధిదారులకు ఇంటికే బియ్యాన్ని సరఫరా చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ఏకంగా 9260 వాహనాలను కొని ఇచ్చేందుకు సిద్ధం చేసింది.

ఏపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇంటికే చేరవేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తరుఫున 9260 వాహనాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ వాహనాలు కొనుగోలుకు 60శాతం సబ్సిడీ, 30శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పదిశాతం డబ్బు చెల్లించి యువత వాహనం సొంత చేసుకోవచ్చు.

ఇక ఈ లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హామీ ఇచ్చేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల పేరుతోనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. వాహనాల సబ్సిడీ కోసం 331 కోట్లు లోన్ తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఖర్చులతో కలిపి బియ్యం డోర్ డెలివరీకి ప్రతీ ఏడాది 776.45 కోట్ల రూపాయలు అదనపు నిధులు మంజూరు చేశారు.
Tags:    

Similar News