ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం... కేబినెట్ మీటింగ్‌ కు షెడ్యూల్‌

Update: 2019-10-18 07:23 GMT
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఆషామాషీ నిర్ణ‌యం కాదు.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణ‌యాలు, ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు తీరు తెన్నుల‌ను స‌మీక్షించేందుకు  ఇకపై నెలకు రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఏపీ కేబీనేట్ భేటీ  ప్రతి నెల 2, 4వ బుధవారాల్లో  నిర్వహించనున్నారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు.

కేబినెట్‌లో చర్చించే అంశాలను అన్ని శాఖల అధికారులు మూడు రోజుల ముందుగానే పంపించాలని సీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం  సూచించారు. జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌తి నెల‌లో రెండు సార్లు మంత్ర‌లు స‌మావేశం నిర్వ‌హిస్తే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుతెన్నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకునే అవకాశం ఉంటుంది. అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని సంక్షేమ ప‌థ‌కాలను ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డానికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ఇక ప్ర‌భుత్వం చేసే విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు స‌త్వ‌ర‌మే అమ‌లు చేసేందుకు, క్షేత్రస్థాయిలో అధికారులు ప‌నితీరును అంచాన వేయ‌డం వంటి కీల‌క నిర్ణ‌యాలు వెంట‌వెంట‌నే తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రి దివంగ‌త డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న ప‌రిపాల‌న ఉరుకులు ప‌రుగుల మీద న‌డిచేందుకు, ప్ర‌భుత్వ ఫ‌లాలు  ప్ర‌జ‌ల‌కు స‌క్ర‌మంగా అందేందుకు మంత్రివ‌ర్గ స‌మావేశాలు ఇలా నిర్వ‌హించేవారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా త‌న పాల‌న‌లో తండ్రి పాల‌న‌ను అనుక‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో మంత్రుల ప‌నితీరుపైన‌, అధికారుల ప‌నితీరుపైనా స‌మీక్షించుకునే అవ‌కాశం క‌లుగుతుంది. తద్వారా అధికారుల్లో, ప్ర‌జాప్ర‌తినిధుల్లో అల‌స‌త్వం పోయి ప‌నుల్లో చురుకుగా ఉంటార‌ని మంత్రిమండ‌లి స‌మావేశాలు నెల‌కు రెండుసార్లు స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇక జ‌గ‌న్ ప‌రిపాల‌న మ‌రింత వేగంతో ముందుకు సాగనుంది.
Tags:    

Similar News