సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Update: 2021-01-21 13:58 GMT
ఏపీ హైకోర్టు ఏపీలో స్థానిక ఎన్నికలపై తీర్పును ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ వాదించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ఇప్పటికే ప్రభుత్వం తరుఫున వాదించారు. అయితే హైకోర్టు మాత్రం పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యాక్సినేషన్ తో ఎన్నికలకు సంబంధం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైకోర్టు తీర్పుపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సర్కార్ పిటిషన్‌లో పేర్కొంది. కాగా, పంచాయితీ ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉదయం తీర్పునిచ్చిన సంగతి విదితమే.

అంతకముందు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టుకు సంబంధించిన సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఎన్నికలను యధావిధిగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పును ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Tags:    

Similar News