హైకోర్టు న్యాయమూర్తులకు కియా కార్లు..ఏపీ ప్రభుత్వం ఆమోదం

Update: 2021-03-26 07:28 GMT
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్  హైకోర్టు న్యాయ మూర్తుల వినియోగానికి కొత్తగా 20 కియా కార్లు కొనుగోలుకు  ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కటి 31.5 లక్షల రూపాయల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలు చేసేందుకు ఏపీ సర్కారు పచ్చజెండా ఉపింది. ఇందుకు అవసరమైన 6.3 కోట్లు రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది.  న్యాయమూర్తుల వినియోగానికి కొత్త కియా కార్నివాల్‌ కార్లు కావాలని హైకోర్టు నిర్ణయించినట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ మార్చి 24న ప్రభుత్వానికి లేఖ రాశారు. సమ్మతి తెలియజేయడంతోపాటు బడ్జెట్‌ విడుదల చేయాలని అందులో కోరారు. లేఖను పరిశీలించిన ప్రభుత్వం... ఒక్కో కారుకు రూ.31.50 లక్షల చొప్పున మొత్తం రూ.6.30 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖకు సూచించింది.

ఈమేరకు న్యాయశాఖ కార్యదర్శి సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఒకప్పుడు ఏపీ హైకోర్టులంటే మండిపడిన సీఎం జగన్ ఇప్పుడు ఇలా కియా కార్లు సైతం అందించేందుకు అంగీకారం తెలపడం శుభపరిణామమే. అయితే ఇదంతా ఓ రొటీన్ ప్రక్రియ మాత్రమేనని, దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు కొత్త కియా కార్లు ఇచ్చేందుకు జగన్ సర్కారు  ఆమోదం తెలపడం విశేషం.
Tags:    

Similar News