ప్రజాసేవలో మేము సైతం..జగన్ సంచలనం

Update: 2020-02-28 04:15 GMT
వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ప్రజలు కట్టబెట్టింది మామూలు అధికారం కాదు.. ఏకంగా క్లీన్ స్వీప్ లాంటిదే.  బలమైన టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసి ఏకంగా 150మందికిపైగా ఎమ్మెల్యేలను జగన్ కు కట్టబెట్టారు. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ అపూర్వ విజయాన్ని సాధించిపెట్టారు.

మరి గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చేయాలి కదా..  అందుకే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సేవకుడిగా వారికి అందుబాటులో ఉండి సేవా చేయాలని ఆదేశించారు. ప్రతి బుధవారం సచివాలయంలో మంత్రులు అందుబాటు లో ఉండాలని తాజాగా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రజలకు.. అర్జీదారులకు ప్రతి బుధవారం సెక్రటేరీయేట్టులో మంత్రులు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు.

ఇదివరకూ కూడా జగన్ ప్రతి మంగళ, బుధవారాలు విధిగా సచివాలయానికి రావాలని గతంలో కేబినెట్ సమావేశం లో మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. అయితే దూరభారం, సంక్షేమ పథకాల  దృష్ట్యా ఇప్పుడు  మంత్రులు సచివాలయంలో వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజలు ఇచ్చిన గెలుపును, బాధ్యతను గుర్తెరిగి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అందరిలోనూ ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News