కరోనా పరీక్షలపై జగన్ సర్కార్‌ కీలక ఆదేశాలు..ఆ అనుమతి తీసుకోవాల్సిందే ?

Update: 2020-07-27 10:50 GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేటు ల్యాబ్ లు సొంతంగా సేకరించే శాంపిళ్లకు ఈ ధరలు వర్తిస్తాయి.

ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌ లలో కరోనా టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి ఎక్కువ వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే , కరోనా పరీక్షలు చేసే ల్యాబ్ సిబ్బంది ఐసీఎంఆర్‌ లాగిన్ ‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో, ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్‌ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందు నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించింది.
Tags:    

Similar News