ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య పై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో అడ్మిషన్ల కోసం టీచర్లను వేధించడం, విద్యార్థుల ఇళ్లకు పంపించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.ఇలాంటి విపత్కర సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు టీచర్ల జీతాల్ని అడ్మిషన్లతో ముడిపెట్టడం సమంజసం కాదు అని తెలిపింది.
ఈ విషయంపై తాజాగా ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్.కాంతారావు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో వారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అడ్మిషన్ల కోసం తమ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వారి జీతాన్ని అడ్మిషన్లకు ముడిపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది.