ఒక రాష్ట్రానికి గవర్నర్ అంటే ఆ హోదానే వేరు. గవర్నర్ అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. దీనితో అయన ఎక్కడికి వెళ్లినా కూడా ప్రత్యేకమైన ఆహ్వానం ఉండాల్సిందే. గవర్నర్ అంటే రాజ్యాంగ పరమైన హోదా. సాధారణం గా గవర్నలకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీ గా ఎన్నో రోజుల నుండి వస్తుంది, కానీ, ప్రస్తుత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ మాత్రం తనకి ఎటువంటి రెడ్ కార్పెట్ స్వాగతం అవసరంలేదు అని , అనవసర ఖర్చులు దేనికి అంటూ అధికారులకి తెలిపారు.
ఇకనుంచి ఆడంబరాలు, బ్రిటిష్ కాలంనాటి సంప్రదాయాలు పాటించవద్దు అని , అనవసర ఖర్చులకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయన ఇటీవల శ్రీశైలం పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ మేరకు చెప్పారు. సాధారణంగా గవర్నర్ టూర్ అంటే .. ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లో పర్యటనలకు వెళ్తారు. విమానం దిగినప్పటి నుంచి కారు వద్దకు వెళ్లే వరకు ఎర్రతివాచీ పరిచి అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అయితే అలాంటి పద్ధతులు , నా విషయం లో పాటించాల్సిన పనిలేదని చెప్పారు. గతంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ , అయన సాధారణ ప్రయాణికుడిలానే సాధారణ విమానం లోనే వెళ్లారు. అదే సమయం లో ఆయనకు పలు సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్నవారు మొక్కలను బహుమతిగా ఇస్తున్నారు. ఆయన ఆ మొక్కలన్నింటినీ రాజ్‌భవన్ ప్రాంగణంలో నాటిస్తున్నారు. కొన్ని ఉద్యోగులకు ఇచ్చి పలు చోట్ల నాటేలా చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గవర్నర్ ని ఆదర్శంగా తీసుకోని అందరూ అధికారులు ఇలానే కొనసాగితే ..ప్రభుత్వానికి వృధా ఖర్చు అంతా మిగులుతుంది.