ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సుగాలి ప్రీతి హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైన కేసుని సీబీఐకి అప్పగించాలంటూ గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.
2017లో కర్నూలు జిల్లాలో ఓ బాలిక మీద అత్యాచారం హత్య జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో క్లాస్ రూమ్ లోనే ఉరేసుకుంది. ఆమె అత్యాచారం, హత్యకు గురైందని పోలీసులు తేల్చారు. హత్యాచారం కేసులో పలువురు టీడీపీ నేతలు, అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కర్నూల్లో ర్యాలీ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్ జగన్ కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడే కేసును సీబీఐకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు
కర్నూలు లక్ష్మీగార్డెన్స్ ప్రాంతంలో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఈ సుగాలి ప్రీతి. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని చెబుతున్నారు. అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని ఆరోపిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ధ్రువీకరించారు. కలెక్టర్ నియమించిన కమిటీ కూడా లైంగికదాడి తర్వాత హత్య జరిగినట్టు ధ్రువీకరించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ తరువాత విచారణ ముందుకు సాగకపోవడంతో.. బాధితురాలి తల్లిదండ్రులు ఎన్‌హెచ్ఆర్సీని ఆశ్రయించంతో వారి ఆదేశాల ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కానీ , ఈ కేసులో రాజకీయ నేతల పాత్ర కూడా ఉన్నందువల్ల ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక ఈ కేసుని సీబీఐ తో విచారణ జరిపిస్తాం అని సీఎం జగన్ హామీ ఇచ్చారు ..అందులో భాగంగానే నేడు ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.