అక్క‌డ‌ ఓట‌మి త‌ప్ప‌దు సార్.. వైసీపీలో గుస‌గుస‌

Update: 2022-08-01 03:50 GMT
కొన్ని కొన్ని విష‌యాల‌పై వైసీపీ నాయ‌కులు చాలా క్లారిటీతో ఉంటున్నారు. ఎక్క‌డ నాయ‌కులు గెలుస్తారో.. ఎక్క‌డ ఓడిపోతారో.. తాడేప‌ల్లి వ‌ర్గాల‌కు క్లూ అందుతోంది. మ‌రి వ‌లంటీర్లు ఇస్తున్న స‌ర్వే రిపోర్టులో.. లేక‌.. ఐప్యాక్ ఇస్తున్న స‌ర్వేలో తెలియ‌దు కానీ.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై వారు ముందుగానే.. భ‌విష్య‌త్తు చెప్పేస్తున్నారు. ఇలాంటి వాటి జాబితాలో.. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలు చేరిపోయాయ‌ని అంటున్నారు. త‌క్ష‌ణ‌మే అక్క‌డ కొత్త‌నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కూడా అనేస్తున్నార‌ట‌. అయితే.. పార్టీలో ఇంత జ‌రుగుతున్నా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం నేత‌లు మార‌డం లేదు.

స‌రే.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. గుంటూరు జిల్లాలోని తెనాలి, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పు త‌ప్ప‌ద‌ని తాడేప‌ల్లి గూటికి.. సంకేతాలు అందాయ‌ని చెబుతున్నారు. తెనాలి అంటే.. టీడీపీకి కంచుకోట‌. గ‌తంలోనూ.. త‌ర్వాత‌.. కూడా.. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన కోట‌రీ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ చేయించిన స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసింది. ఆల‌పాటి రాజా.. అయితే.. తిరుగులేని విజ‌యం ద‌క్కించుకుంటార‌ని.. చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. ఇక‌, ఇదేస‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌కు కూడా ఇక్క‌డి ప‌రిస్థితి అవ‌గ‌తం అయిపోయింది.

ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. ముక్కుసూటిగా మాట్టాడేఆయ‌న‌కు రాజ‌కీయంగా లౌక్యం తెలియ‌క పోవ‌డం పెద్ద మైన‌స్ అయిపోయిందని.. పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎవ‌రైనా ఆయ‌న వ‌ద్ద‌కు స‌మ‌స్య‌తో వ‌స్తే.. అందుబాటులో లేక పోవ‌డం కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింద‌ని .. నాయ‌కులు చెబుతున్నారు దీంతో ప్ర‌జ‌ల‌కు అన్నాబ‌త్తునికి మ‌ధ్య దూరం పెరిగింది. ఇది వైసీపీకి మైన‌స్‌గా మారుతోంద‌ని.. ఇప్ప‌టి నుంచి అయినా.. స‌రిదిద్దుకోవాల‌ని.. సూచిస్తున్నారు.

ఇక‌, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం బాప‌ట్ల‌. ఇక్క‌డ వైసీపీ వ‌రుస విజ‌యాలు సాధించింది. 2014, 2019 ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన కోన ర‌ఘుప‌తి ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలి ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది. దీంతో ఆయ‌న ఇక్క‌డ ఎలాంటి ప‌నులు చేయ‌లేక‌పోయారు. ప్ర‌జ‌లు కూడా అర్ధం చేసుకున్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న రెండో సారి కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇప్పుడు కూడా ఆయ‌న ప‌నులు చేయించ‌లేక పోతున్నార‌ట‌. దీంతో ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం త‌గ్గింద‌నేది వైసీపీ నేత‌ల మాట‌.

మ‌రోవైపు.. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న టీడీపీ నేత‌.. వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ‌.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఏ ప‌ని అయినా.. వెంట‌నే చేసేస్తున్నార‌ట‌. అధికారులతోనూ మాట్లాడి చేయిస్తున్నార‌ని టాక్‌. సో.. దీంతో బాప‌ట్ల‌ను కూడా ఈ సారి వైసీపీ వ‌దులుకోవాల్సిందేన‌ని.. ఆ పార్టీ నేత‌ల టాక్‌. ఏదైనా మెరుపులాంటి నాయ‌కుడు.. ఇక్క‌డ‌కు వ‌స్తే.. త‌ప్ప‌.. విజ‌యం సాధ్యం కాద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News