'ఆ స్కూల్లో సాక్షి మాత్రమేనా? మిగిలిన పత్రికల్ని ఉంచండి'.. ఏపీ హైకోర్టు తాజా మాట

Update: 2022-12-23 04:08 GMT
తమ ప్రభుత్వం గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుకోవాలి. నెగిటివ్ అన్నది దరికే చేరొద్దని అనుకోవటం మంచిదే. కానీ.. అది తమ మాటల్లో కంటే తమను వేలెత్తి చూపించే వారి విషయంలో ఉండాలన్న తపన పాలకుల్లో ఉంటే.. ఆటోమేటిక్ గా తక్కువ తప్పులకు అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వచ్చే ఇబ్బంది ఎంతన్నది తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్నపరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో దినపత్రికల్ని అందుబాటులోఉంచటం మంచిదే. అలా అని.. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన మీడియా సంస్థ నుంచి విడుదలయ్యే పత్రికను మాత్రమే ఉంచటం తప్పే అవుతుంది.

అయితే.. ఇలాంటి విషయాల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఏపీ సర్కారు లేదు. ఇదే.. తాజాగా హైకోర్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. తమ ఎదుట హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పిన మాటల్ని విన్నప్పుడు.. అంత పెద్ద స్థాయిలో ఉన్నవ్యక్తి.. ఇలాంటి విషయాలకు సమాధానాల్ని చెప్పే పరిస్థితిని తెచ్చుకున్నారే అన్న భావన కలుగక మానదు.

తాజాగా హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇటీవల తాను ప్రభుత్వ పాఠశాలను సందర్శించానని.. అక్కడి దుర్బర పరిస్థితుల గురించి ప్రస్తావించటమే కాదు.. సాక్షి పత్రిక ప్రస్తావన తీసుకొచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఏమన్నారంటే.. ''శ్రీకాకుళం జిల్లాలోని ఒక హాస్టల్ ను సందర్శించా. 150 మంది విద్యార్థినులు ఇరుకైన మూడు గదుల్లో ఉన్నారు. రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి.

అదనపు గదుల నిర్మాణం రూ.15లక్షల కొరత కారణంగా ఆగినట్లుగా అక్కడి అధికారులు చెప్పారు. 150 మంది విద్యార్థినులకు ఒక్క సాక్షి పత్రిక కాపీ మాత్రమే అందుబాటులో ఉంది.

మిగిలిన పత్రికలు ఎందుకు లేవు? అవి కూడా.. రెండు, మూడు కాపీలు అందుబాటులో ఉంచండి. ఇది నా పర్సనల్ వినతి' అంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి నోటి ఇన్నిమాటలు వచ్చిన వేళ.. ప్రభుత్వం తీరులో ఏ మాత్రం మార్పు వస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News