పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. సంప్రదించకుండా సొంతంగా ‘ఈ-వాచ్' యాప్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చని.. ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని లాంచ్ చేశారు.
అయితే నిమ్మగడ్డ రూపొందించిన 'ఈ-వాచ్' యాప్ పై ఏపీ ప్రభుత్వం సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ఈ-వాచ్ యాప్ ను 9వ తేది వరకు ఆపరేట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
సెక్యూరిటీ పరిశీలన లేకుండా ఈ యాప్ ను ఉపయోగించడానికి వీల్లేదని పిటీషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్ ఉండగా.. ఈ యాప్ ను ఎందుకు చేశారని పిటీషనర్లు ప్రశ్నించారు.ఈ-వాచ్ యాప్ కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్ చెప్పింది. ఈలోప్ యాప్ ను పరిశీలించాలని ఏపీటీఎస్ కు ధర్మాసనం సూచించింది.
అయితే యాప్ రూపొందించడానికి ఎస్ఈసీకి భారత ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని ఎన్నికల కమిసన్ న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు ఈనెల 9కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు యాప్ ను వినియోగించవద్దని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది.