మేమే కమిటీని నియమిస్తాం...వైసీపీకి గట్టి షాక్

Update: 2022-12-21 14:49 GMT
విశాఖ రుషికొండ మీద పర్యావరణాన్ని దెబ్బతీసేవిధంగా అక్రమంగా అనుమతి లేని త్రవ్వకాలు జరుపుతున్నారని పిటిషన్లు దాఖలు అయిన సంగతి విధితమే. దీని మీద హై కోర్టు ఆ మధ్యన ఒక కీలకమైన  ఆదేశాన్ని ఇచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కలుపుకుని ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రుషికొండ త్రవ్వకాల విషయంలో వాస్తవాలతో కూడిన నివేదికను తమను అందించాలని సూచించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వ చెందిన అధికారులతోనే కమిటీని కేంద్రం  వేసిందని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, జాన్సేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టుకు వెళ్లారు. కమిటీ ఏర్పాటు కూర్పు హై కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీని మీద విచారణ జరిపిన హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని ఎలా వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.    ఇక తాజాగా కమిటీ నియామకాన్ని సమర్ధిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం హై కోర్టుకు తెలిపింది. అయితే దీని మీద హై కోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని నిలదీసింది. దాంతో ఇక  తామే ఒక కమిటీని ఏర్పాటు చేసి మరీ రుషికొండ అక్రమ తవ్వకాల మీద విచారణ జరిపిస్తామని స్పష్టం చేసింది. అదే  విధంగా ఈ కమిటీ మీద అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు దాఖలు చేయాలని పేర్కొంది.

దీన్ని బట్టి చూస్తే ఇది వైసీపీ సర్కార్కి గట్టి షాక్ అని అనుకోవచ్చు అంటున్నారు. రుషికొండ విషయంలో ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వానికి అన్నీ  ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాము పర్యావరణ అనుమతులతోనే నిర్మాణాలు అక్కడ చేపడుతున్నామని చెబుతున్నా కూడా విపక్షాలను చూడడానికి అనుమతించకపోవడంతోనే అసలు వివాదం ఏర్పడింది. అదే సమయంలో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని సీపీఐ నేత నారాయణ అక్కడ కట్టడాలను చూశారు.

తాజాగా వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ కూడా రుషికొండను సర్వనాశనం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోర్టు సైతం దీని మీద ఎప్పటికపుడు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇపుడు హై కోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందంటే మరి వైసీపీ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరం అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News