గాలి క‌బుర్ల‌తో హైకోర్టులో పిల్ వేస్తారా?

Update: 2020-08-28 17:34 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు వేదిక‌గా ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. కొంత‌మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ప్ర‌చారం కొద్దిరోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇలాంటి ప్ర‌చారం ఏకంగా హైకోర్టు వేదిక‌గా జ‌రిగింది. అమ్మఒడి పథకానికి దేవదాయ శాఖ నిధులు మళ్లించారని పిటిషన్ విచారణ సంద‌ర్భంగా కనీస వివరాలు లేకుండా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వాజ్యాలు దాఖ‌లు చేస్తున్నారని, ఇలాంటి పిల్స్ వేయడం సర్వ సాధారణమైందని అడ్వొకేట్‌ జనరల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ వాద‌న‌తో ఏకీ భ‌వించిన‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

దేవాదాయ శాఖ నిధుల మ‌ళ్లింపు, ముఖ్యంగా ‘అమ్మ ఒడి’ పథ‌కానికి వీటిని ఉప‌యోగిస్తున్నారని గ‌త కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యున్నత న్యాయస్థానంలో ప్ర‌జాప్రయోజ‌న వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. నిధులు మళ్లించలేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. దేవాదాయశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ భాగం కాదని, నిధులు మళ్లిస్తున్నట్లు జీవోలో ఎక్కడా చెప్పలేదని ఏజీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏజీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆధారాలు లేకుండా జ‌రిగే చ‌ర్చ ఆధారంగా ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యాలు దాఖ‌లు కాకుండా న్యాయ‌స్థానం త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

దీంతో ఏపీ అడ్వ‌కొటే జ‌న‌ర‌ల్ వాద‌న‌ల‌ను హైకోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. అమ్మ ఒడి ప‌థ‌కానికి నిధులు మళ్లిస్తున్నారని ఎలా చెబుతున్నారు..? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిష‌న్‌దారు సరైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. ఈ క్రమంలో పిటిషన్ కొట్టివేతకు ఏపీ హైకోర్టు సిద్ధమైంది. అయితే.. ఇందుకు స్పందించిన పిటిషనర్ అదనపు సమాచారంతో అఫిడవిట్‌ దాఖలుకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయ‌స్థానం అంగీక‌రించింది.
Tags:    

Similar News